ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా వైరస్ గురించి చేసిన హెచ్చరికను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెడచెవిన పెట్టాడు. ఆ... పప్పు గాడి మాటలు ఎవరు పట్టించుకుంటారు అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తన అనుకూల మీడియాతో రాహుల్ ను దేశంలో పప్పుగా బదనాం చేసిన మోడీ రాజకీయంగా రాహుల్ ను ఆన్ పాపులర్ చేయడంలో కృతకృత్యుడయ్యాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న దరిమిలా రాహుల్ గాంధీ రాజకీయ వైరాగ్యంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పుడప్పుడు ట్విట్టర్ లో ట్వీటడం తప్ప క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. అయితే 2020 ఫిబ్రవరి 12న రాహుల్ గాంధీ కరోనా వైరస్ వలన దేశంలో రాబోయే ప్రమాదం గురించి తన ట్విట్టర్ లో హెచ్చరించారు. ప్రధాని మోడీ దీనిని లైట్ తీసుకున్నారు. అప్పటికే దేశంలో తొలి కేసు జనవరి 30న నమోదయింది. ఆ తర్వాత 13 రోజులకు అంటే ఫిబ్రవరి 12 న రాహుల్ గాంధీ ట్విట్టర్ లో హెచ్చరించారు. అప్పటికి దేశంలో కరోనా కేసులు కేవలం 3 మాత్రమే. అప్పుడే మోడీ పట్టించుకుని వెంటనే విదేశాల నుంచి రాకపోకలు బంద్ చేసి ఉంటే దేశంలో కరోనా ప్రబలే అవకాశం ఉండేది కాదు. కానీ మోడీ రాహుల్ చెబితే నేను ఎందుకు వినాలి అన్నట్టుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ లోగా ఫిబ్రవరిలో ఇండియాలో చాలా ఫెస్టివల్స్ జరిగాయి. మహా శివరాత్రి, హంపి ఫెస్టివల్, ఖజురహో డాన్స్ ఫెస్టివల్, కోణార్క్ పండగ, గోవా కార్నివాల్ లాంటి పండగలు చాలా జరిగాయి. పైగా ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి లక్ష మందితో భారీ స్వాగతం పలికారు. ప్రపంచ దేశాల్లో తన ఇమేజ్ ను పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. పోనీ ఫిబ్రవరి నెలాఖరుకు అయినా మేల్కొన్నారా ...లేదు... మార్చి 21 వరకు కళ్ళు తెరవలేదు... అప్పటికి ఇండియాలో కరోనా కేసులు 3 నుంచి 334 కు పెరిగాయి. అప్పుడు కూడా ఏమి చెప్పారు... ఫిబ్రవరి 22 ఆదివారం కేవలం 14 గంటలు ఇంట్లో ఉంటే చాలు కరోనా ఇక రాదు అన్నట్టుగా చెప్పారు. అంతేకానీ జనాలకు కరోనా సీరియస్ నెస్ గురించి విడమరచి చెప్పలేదు. జనాలంతా రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. అప్పుడు కూడా ఏ.పీ, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఎందుకయినా మంచిదని మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించినా... మన ప్రధాన మంత్రి గారు మాత్రం మార్చి 23 దాకా పట్టించుకోలేదు. అప్పుడు కళ్ళు తెరిచి మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 దాకా దేశం మొత్తం లాక్ డౌన్ అని ప్రకటించారు. ఈ లోగా మన సారు వారు మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి... బి.జె.పీ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించే పనిలో బిజీగా ఉన్నారు పాపం. ఇప్పుడు తన తప్పులు దాచి పెట్టి నెపం అంతా నిజాముద్దీన్ ముస్లింల సభల మీదకు నెట్టేసి దీనిని కూడా ఇలా రాజకీయం చేసేస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ చెప్పినప్పుడే ఫిబ్రవరి 12 నే మేల్కొని సభలు, సమావేశాలు ఇతర వేడుకలు అన్నిటికి అనుమతులు ఇవ్వకుండా ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు కదా..
రాహుల్ హెచ్చరికను పెడచెవిన పెట్టిన మోడీ

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి