Translate

  • Latest News

    16, ఏప్రిల్ 2020, గురువారం

    రోడ్డుపై ఉమ్మివేసినందుకు కేసు న‌మోదు


    కోవిడ్-19పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం నిబంధనలను ఉల్లంఘించినందుకు రాజస్థాన్ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. రాజస్థాన్ పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం...

    భరత్ పూర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు ఈ నెల 14న అష్ట దిగ్బంధనం నిబంధనలను ఉల్లంఘించారు. రోడ్డుపై ఉమ్మి వేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 188 (ప్రభుత్వ అధికారి ప్రకటించిన ఆదేశాలను పాటించకపోవడం), సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్) ప్రకారం కేసులు నమోదు చేశారు. 

    ఈ నెల 14న పోలీసు అధికారుల బృందం గస్తీ తిరుగుతుండగా భరత్ పూర్ ఏరియాలోని వేర్వేరు చోట్ల ఈ ఇద్దరు వ్యక్తులు సరైన కారణం లేకుండా సంచరిస్తుండటం గమనించారు. వీరు అష్ట దిగ్బంధనం నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. రోడ్లపై ఉమ్మివేసినట్లు గుర్తించారు. వెంటనే వీరిని పోలీసులు అరెస్టు చేశారు. 

    నమిలి, ఉమ్మేసే పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో నమిలి, ఉమ్మివేయడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ చర్య తీసుకుంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రోడ్డుపై ఉమ్మివేసినందుకు కేసు న‌మోదు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top