Translate

  • Latest News

    15, ఏప్రిల్ 2020, బుధవారం

    మండల దీక్షతోనే కరోనా కట్టడి


    మండల దీక్ష తోనే కరోనా కట్టడి చేయగలం... అవును... అయ్యప్ప మండల దీక్షలు... కనక దుర్గమ్మ మండల దీక్షలు... శివ దీక్షలు.... ఆంజనేయ స్వామి దీక్షలు అని మనం మండల రోజుల పాటు దీక్షలు చేస్తాం... కానీ... ఆ దీక్షల వలన మనకు ఎంత పుణ్యం వస్తుందో...లేదో తెలియదు కానీ... మన దేశ ప్రజలు అందరూ... ఆస్తికులు...నాస్తికులు... హేతువాదులు...కమ్యూనిస్టులు... అందరూ ఇజాలతో సంబంధం లేకుండా... నిజాల నేల మీద నిలబడి... భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ... ప్రతి ఒక్కరూ కరోనా కట్టడి కోసం చేస్తున్న ఈ మండల దీక్షను విజయవంతంగా పూర్తి చేయాలి... మండల దీక్షలో తోలి భాగమైన మొదటి 21 రోజులను అందరం విజయవంతంగా పూర్తిచేశాం... రెండో దశ అయిన  మిగతా 19 రోజుల దీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేస్తే... కరోనా కాదు... దాని తలలో జేజమ్మ కూడా మనల్ని ఏమి పీకలేదు... సో... ఓ నా భారత దేశ సోదర సోదరీమణులారా... మనమంతా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు మే నెల మూడో తేదీ వరకు బయట తిరగకుండా అందరూ ఇళ్ల లోనే ఉండి మండల దీక్షను విజయవంతంగా పూర్తి చేద్దాం...కరోనా కోరలు పీకేద్దాం...  మేరా భారత్ మహాన్...


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మండల దీక్షతోనే కరోనా కట్టడి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top