Translate

  • Latest News

    29, ఏప్రిల్ 2020, బుధవారం

    ఎవడబ్బ సొమ్మని...



    ఎవడబ్బ సొమ్మని... సారీ... ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు... కడుపు మండితే ఇలాంటి మాటలే వస్తాయి మరి.. అది నా తప్పు కాదు... మోడీ ది. అదేమిటీ మధ్యలో మోడీ ఎందుకు వచ్చాడంటారా... అవును...అంతా ఆయనే చేశాడు. తప్పంతా ఆయనదే... 2014 ఎన్నికల ముందు ఎన్నెన్ని మాయ మాటలు చెప్పాడు... విదేశాల్లో ఉన్న మన భారతీయుల నల్ల డబ్బంతా బయటకు తెచ్చి... మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కోట్లాది మంది ప్రజానీకానికి ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తానంటే... మనమంతా నమ్మి... ఓట్లు గుద్దేయలేదూ... గద్దె నెక్కాక ఆ సంగతే ఏమి ఎరగనట్టు నంగనాచి కబుర్లు చెప్పాడు... మధ్యలో ఓ సారి... పేదోళ్లందరిని జన్ ధన్ అకౌంట్లు తెరవమంటే ఇంకేముంది... మన మోడీ గారు 15 లక్షలు  వేసేస్తాడని అందరూ ఎగబడి మరీ బ్యాంకుల చుట్టూ తిరిగి అకౌంట్లు తెరవ లేదూ... అకౌంట్లు తెరిపించాడే కానీ... ఒక్క పైసా విదిలించిన పాపాన పోలేదు మన మోడీ గారు. జనం ఆ మాట అడక్కుండా ఉండడానికి అని... పాకిస్థాన్ బూచి... చూపించి... ప్రజల్ని దేశ భక్తి అనే ఒక మాస్ హిస్టీరియాలో పడవేసి హిప్నటైజ్ చేసి... 2019 ఎన్నికల్లో మళ్ళీ మునుపటికన్నా ఎక్కువ మెజార్టీ తో గెలిచాడు మహా మాయలమారి హిప్నాటిస్ట్ మోడీ.
    ఇదంతా పాత సంగతే కదా... ఇప్పుడెందుకు చెబుతున్నారూ అంటారా... ఈ రోజు పేపర్ లో బిజినెస్ పేజీలో 68 వేల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ అన్న వార్త చదివి వచ్చిన ఫ్రేస్టేషన్ ఇది. ఉద్దేశ పూర్వకంగా బ్యాంకు రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యా, మెహుల్ చోక్సిలతో పాటు మన ఘనత వహించిన రాయపాటి సాంబశివరావు లాంటి మహానగరంలో మాయగాళ్లు 50 మందికి సంబంధించి మొత్తం 68,607 కోట్ల బకాయిలను మాఫీ చేసినట్టు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ విషయం కూడా నేరుగా చెప్పలేదండోయ్... గత ఫిబ్రవరిలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ప్రశ్న వేస్తె సమాధానం చెప్పకుండా ప్రభుత్వ  పెద్దలు దాటవేస్తే... సమాచార హక్కు కింద పిటిషన్ దాఖలు చేస్తే... ఆర్.బి.ఐ గతి లేక... తప్పనిసరై ఈ వివరాలు కక్కింది. ఈ యాభయ్ మందిలో కూడా టాప్ 10 లిస్టులో గీతాంజలి జెమ్స్  5,492 కోట్లు, ఆర్.ఈ.ఐ ఆగ్రో 4,314 కోట్లు, విన్సమ్  డైమండ్స్  4,076 కోట్లు, రొటోమాక్ గ్లోబల్ 2,950 కోట్లు, కుడోస్ కేమి  2,326 కోట్లు, రుచి సోయా  2,212 కోట్లు, జూమ్ డెవలపర్స్  2,012 కోట్లు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 1943 కోట్లు, ఫర్ ఎవర్ ఫ్రెషియస్ 1962 కోట్లు, డెక్కన్ క్రానికల్ 1915 కోట్లు ఉన్నారు. ఇక మన రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సంబంధించి 1790 కోట్లు మాఫీ చేసేశారు . ఇంకో భయంకరమైన నిజం ఏమిటంటే బి.జె.పీ అధికారంలోకి వచ్చాక ఈ ఆరేళ్లలో  దాదాపు 7 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. 7 లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్మురా... అని ప్రతి ఒక్క ఓటరు మోడీని నిలదీయాలి. ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారందరి చెవులు మెలిపెట్టి మరీ పైసాతో సహా వారి నుంచి కక్కించాలి. లాక్ డౌన్ కారణంగా మూడు నెలలో ఈ.ఎం.ఐ లు కట్టనవసరం లేదంటూ ఆర్.బి.ఐ గవర్నర్ పెద్ద గొప్పగా ప్రకటించారు కానీ... ఏ ఒక్క బాంక్ ఆయన మాటల్ని ఖాతరు చేయలేదు... యథా ప్రకారం జనాల అకౌంట్లలో సొమ్ములు కట్ చేసి పడేశాయి. అయినా ఆర్.బి.ఐ పట్టించుకోలేదు... కానీ ఇలాంటి ఘరానా దొంగలకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేసేస్తుంటారు... మన దేశంలో దొంగలు పడ్డారు... దొంగలు...దొంగలు ఊళ్ళు పంచుకుని తినేస్తున్నారు.... ఇకనైనా  ఈ మాస్ హిస్టీరియా నుంచి బయటపడండి... జాగృతులై ఘరానా దొంగల్ని తరిమికొట్టండి... జాగే  రహో... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఎవడబ్బ సొమ్మని... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top