Translate

  • Latest News

    30, ఏప్రిల్ 2020, గురువారం

    శ్రీశ్రీ అన్న రెండక్షరాలు వింటేనే ఒక వైబ్రేషన్...


    శ్రీశ్రీ అన్న రెండక్షరాలు వింటేనే ఒక వైబ్రేషన్... అవును... శ్రీశ్రీ కవితల్లోనే కాదు ఆయన పేరులోనే శబ్ద సౌందర్యం ఉంది. ఒకే అక్షరాన్ని వెంటవెంటనే రెండు సార్లు ఉచ్ఛరిస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆలా తన పేరులోనే ఒక వైబ్రేషన్ సృష్టించుకున్న శ్రీశ్రీ... తన కవితల్లో కూడా అదే మాజిక్ ను ప్రయోగించి పాఠకులను మెస్మరైజ్ చేశాడు.
    మహాప్రస్థానం గేయంలో...
    మరో ప్రపంచం...మరో ప్రపంచం...పిలిచింది...
    పదండి ముందుకు...పదండి తోసుకు... పోదాం...పోదాం పైపైకీ ...
    హరోం...హరోం...హర హర హర హర హర హరోం హరా అని కదలండి...
    జయభేరి గేయంలో...
    నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను 
    నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
    నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను

    అభ్యుదయం గేయంలో...
     ఏవో...ఏవోవో...ఏవోవో
    ఘోషలు వినపడుతున్నాయి
    గుండెలు విడిపోతున్నాయి
    ఎవరో..ఎవరెవరో...ఎవరెవరో..
    తల విరబోసుకు నగ్నంగా నర్తిస్తున్నారు...
    భయోద్విగ్నంగా వర్తిస్తున్నారు...
    చేదుపాట గేయంలో...
    అవును నిజం... అవును నిజం.. అవును నిజం...
    నీవన్నది..నీవన్నది..నీవన్నది..నీవన్నది నిజం..నిజం...
    గర్జించు రష్యా గేయంలో...
    గర్జించు రష్యా... గాండ్రించు రష్యా...
    లేలే రష్యా... రారా రష్యా...
    రష్యా... రష్యా... రష్యా... ఓ రష్యా...
    జగన్నాధ రథచక్రాలు గేయంలో...
    వస్తున్నా యొస్తున్నాయి
    జగన్నాధ...జగన్నాధ... జగన్నాధ రధ చక్రాల్..
    జగన్నాధుని  రధ చక్రాల్..
    రధ చక్రాల్.. రధ చక్రాల్.. రధ చక్రాల్..
    రధ చక్రాలొస్తున్నా యొస్తున్నాయి
    ఇలా ఒకే పదాన్ని వెంటవెంటనే మళ్ళీ మళ్ళీ పలుకుతుంటే ఆ  శబ్ద సౌందర్యం పాఠకులను కట్టి పడేస్తుంది... ఒక ఒక గమ్మత్తయిన మత్తులో పడేస్తుంది... అవును నిజమే... తెలుగు పాఠకులు నిజంగానే గత 80 ఏళ్లుగా ఆ మత్తు లోనే మునిగి తేలుతున్నారు... ఆ మత్తులో చిత్తయి పోతున్నారు...
    (శ్రీశ్రీ 110 వ  జయంతి సందర్భంగా... ఆ మహాకవికి ఇదే మా భిన్నస్వరం నివాళి...)
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శ్రీశ్రీ అన్న రెండక్షరాలు వింటేనే ఒక వైబ్రేషన్... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top