Translate

  • Latest News

    14, మే 2020, గురువారం

    కరోనా సాయంలోనూ రాజకీయాలా...?


    సంక్షోభాలను కూడా పాలకులు తమకు అనుకూలంగా మార్చుకుంటారని భిన్నస్వరం ఇంతకుముందు ఓ వ్యాసంలో చెప్పింది. ఆ అక్షరాలను అచ్చంగా నిజం చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పీ ప్రభుత్వం. మామూలు రోజుల్లో ఎన్ని రాజకీయాలైనా చేయవచ్చు కానీ... కరోనా లాంటి సంక్షోభ సమయాల్లో రాజకీయాలకు అతీతంగా,  పాలకులు నిస్వార్ధంగా, మానవతా కోణంలో ఆలోచించాలి. కానీ దురదృష్టవశాత్తూ 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ ఇలాంటి కీలక సమయంలో సైతం తమ పార్టీకి ప్రయోజనం కలిగే విధంగానే పాకేజీలకు రూపకల్పన చేయడం విచారకరం. 

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న 20 లక్షల కోట్ల   ఫ్యాకేజీ అని దేశ ప్రజలందరినీ మురిపించి మాయ చేశారు... అది విని దేశ ప్రజలంతా ఎవరికీ వారు తలకు ఒక్కొక్కరికి  కనీసం 15 వేల రూపాయలు వస్తాయని ఆశగా ఎదురుచూశారు. నిన్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఏమి చెబుతారా అని చూస్తే .. తీరా తుస్సు మనిపించారు. ఈ 20 లక్షల కోట్లు ఇప్పుడు కొత్తగా ఇచ్చేది కాదని, ఆల్ రెడీ జన్ ధన్ ఖాతాలో 500 రూపాయలు వేశామని, 15 వేల రూపాయల లోపు వేతన జీవులకు మూడు నెలల పాటు ఈపీఎఫ్ కేంద్ర ప్రభుత్వమే కడుతుందని ఇలా... ఇంతకుముందు చెప్పినవి కూడా ఈ ఖాతాలో కలిపేశారు. తీరా ఇప్పుడు కొత్తగా చెప్పినది ఏమిటంటే... ఎం.ఎస్.ఎం.ఈ లు అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు రుణ సదుపాయం కల్పిస్తాం... వాటికి బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వమే హామీ ఉంటుంది అని... అఫ్ కోర్స్... ఇది కొంతవరకు ఎం.ఎస్.ఎం.ఈ లకు ఊరటే,,, దీనివలన పరిశ్రమలు మళ్ళీ రన్నింగ్ లో పడతాయి... మళ్ళీ రూపాయి మారకం జరుగుతుంది. అటు పరిశ్రమ యజమానులకు, వాటిలో పనిచేసే కార్మికులకు చేతిలో రూపాయి ఆడుతుంది... నిజమే.. కానీ...

    దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పేదల కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయి... తెలంగాణలో 1500 చొప్పున ఇస్తే... ఏపీ లో వెయ్యి చొప్పున ఇచ్చారు. రేషన్ ఒక విడత అదనంగా ఇచ్చారు.  కేంద్రం కంటే ముందే ఏపీ ప్రభుత్వం ఎం.ఎస్.ఎం.ఈ లకు కొన్ని వెసులుబాట్లు ప్రకటించింది. కేంద్రం రాష్ట్రాలను ఆదుకుంటే ఇంకొన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడదామని అనుకుంటే... నిర్మలమ్మ గారు వెల్లడించిన విధాన ప్రకటన చూస్తే... తీరా తుస్సుమనిపించారు.  రాష్ట్రాలకు నేరుగా నిధులిస్తే... గతంలో చంద్రన్న కానుక ని.. ఇప్పుడేమో జగనన్న దీవెన అని ఆయా పార్టీలు లబ్ది పొందుతున్నాయే కానీ.. బి.జె.పీ కి మైలేజీ కలగడం లేదని భావించింది. అందుకే కేంద్రమే నేరుగా ఎం.ఎస్.ఎం.ఈ లకు ఫ్యాకేజీ ప్రకటించింది.

    సరే... అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మంది కార్మికుల సంగతేమిటి... ఈ దేశంలో ప్రధాన రంగాలైన వ్యవసాయం, చేనేత రంగాలలో ఉన్న కార్మికుల సంగతేమిటి... భవన నిర్మాణ కార్మికుల సంగతేమిటి... బతుకుజీవుడా అంటూ వందల మైళ్ళు నడిచి స్వగ్రామాలకు వెళ్లిన, వెళుతున్న వలస కార్మికుల సంగతేమిటి... నిన్న ప్రకటించిన ఫ్యాకేజీలో వీరెవరి గురించి కనీసం ప్రస్తావనే లేదు కదా... వారికి కేంద్రం ఏమని సమాధానం చెబుతుంది... అమెరికా ఆ దేశ ప్రజలకు 23 ట్రిలియన్ డాలర్లు ప్రకటించింది.  జపాన్ జి.డి.పే లో 23 శాతం ఇచ్చింది.  చైనా  ప్రతి వ్యక్తికీ నేరుగా సాయం అందించే ఏర్పాట్లు చేసింది. మరి ఇండియా ఈ దేశంలో సామాన్యుల కోసం ఏమి చేసింది... ఆత్మ  నిర్భర్ భారత్ అభియాన్ అని ఆడంబరంగా పేరు పెట్టడం తప్ప... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కరోనా సాయంలోనూ రాజకీయాలా...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top