Translate

  • Latest News

    13, జూన్ 2020, శనివారం

    జగన్ వేసిన ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు


    జగన్ పన్నిన ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నాడు...  42 ఏళ్ల  రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాను  జగన్ ఉచ్చులో చిక్కుకుంటున్నట్టు తనకు తెలియకుండానే చిక్కుకున్నాడు. 70 ఏళ్ల  వయసు మీద పడిన వేళ  మతి తప్పి, తానేం మాట్లాడుతున్నాడో కూడా కనీస స్పృహ లేకుండా అపభ్రంశపు మాటలు మాట్లాడి జనంలో ఇంకా అభాసుపాలవుతున్నాడు. నేరం చేసినట్టు పక్కా ఆధారాలు ఉన్న ఈ.ఎస్.ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును, ఆయనతో పాటు ఈ.ఎస్.ఐ డైరెక్టర్ లను అరెస్ట్ చేస్తే...అన్యాయం..అక్రమం.. బి.సి. నాయకుడిపై కక్ష గట్టి అరెస్ట్ చేస్తారా... అంటూ తానూ, తన పార్టీ వాళ్ళతో నానా యాగీ చేసి జనం దృష్టిలో చులకన అయ్యాడు. అవినీతికి  కులం కార్డుతో ముసుగు వేయాలని చూసి తానే పలచన అయ్యాడు. చంద్రబాబు బి.సి నాటకానికి తెర వేయడానికి జగన్ వెంటనే జె.సి.ప్రభాకర రెడ్డిని, ఆయన కొడుకు అస్మిత రెడ్డిని అరెస్ట్ చేయించాడు. దీంతో  టి.డి.పీ నాయకులు ఇక కులం మాట ఎత్తే అవకాశం లేకుండా చేసాడు. ఇక చేసేది లేక చంద్రబాబు జగన్ తన తప్పులు కప్పి పుచ్చుకోవడానికే... ప్రజలను డైవర్ట్ చేయడానికే తెలుగుదేశం నాయకులపై కక్ష కట్టి అరెస్ట్ చేయిస్తున్నాడంటూ గళం ఎత్తుకున్నారు. కానీ.. ఆవేశంలో చంద్రబాబుకు బుర్ర ఏ మాత్రం పనిచేయడం లేదు... జగన్ ను విమర్శించే క్రమంలో తాను పప్పులో కాలేస్తున్నాడు... అవినీతి,  తప్పుడు పనులు చేసినట్టు పక్కాగా సాక్ష్యాలతో దొరికిన అచ్చెన్నాయుడును, జె.సి. ప్రభాకర రెడ్డిని సపోర్ట్ చేసి తాను జనానికి మరింత దూరం అయిపోతున్నాడు. సరిగ్గా తాను ఇలా చేస్తే బాబు ఎలా రియాక్ట్ అవుతాడని జగన్ ఊహించాడో... అలాగే రియాక్ట్ అయి జగన్ వేసిన ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నాడు. పాపం... చంద్రబాబు...
    జె.సి కొడుకు జగన్ కు క్లాస్ మెట్ అయినా సరే... 
     నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. దానికి కుల, మత , వర్గ, ప్రాంతీయ వివక్ష ఏమీ  ఉండదని నిరూపించడానికే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జె.సి.ప్రభాకర రెడ్డిని, ఆయన తమ్ముడి కొడుకు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయించాడు. ఏదో శ్రీకాకుళం వాళ్ళని... అది బి.సి.లని వివక్ష తో అరెస్ట్ చేశారు... వాళ్ళ రాయలసీమ రెడ్లను అయితే అరెస్ట్ చేసేవాడా అని ఎవరూ అనేందుకు వీలు లేకుండా అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన మరుసటి రోజే జె.సి. ప్రభాకర రెడ్డి ని, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయించాడు. జె.సి దివాకర రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డి జగన్ కు క్లాస్ మెట్. బాగా సన్నిహితుడు... ఒక దశలో పవన్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరతాడని కూడా ప్రచారం అయింది. జగన్ కాస్త మెత్తబడినా.. విజయమ్మ   జె.సి ఫ్యామిలీ ని చేర్చుకోవడానికి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. అంత  సాన్నిహిత్యం ఉన్నప్పటికీ అవినీతికి పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని జగన్ జె.సి అరెస్ట్ ద్వారా జనానికి సందేశం పంపాడు.
    చంద్రబాబు ఎంత గోల చేస్తే అంత చెడ్డ పేరు వస్తుంది
    వాస్తవానికి 150 కోట్ల ఈ.ఎస్.ఐ కుంభకోణం కానీ, జె.సి బ్రదర్స్ 150 బి.ఎస్. 3 వాహనాలను నకిలీ పత్రాలతో బి.ఎస్ 4 వాహనాలుగా మార్చిన కుంభకోణం కానీ నిన్న, ఇవాళ బయటకు వచ్చిందేమీ కాదు... గత ఆరు నెలలుగా ఆ కుంభకోణాల మీద అధికారులు క్షుణ్ణంగా పరిశోధన చేసి అవినీతి జరిగిందని నిగ్గు తేల్చాకే ఈ అరెస్టులు జరిగాయి. దీనిపై చంద్రబాబు ఎంత గోల చేస్తే అంత ఆయనకే చెడ్డ పేరు వస్తుంది. కానీ తప్పదు.. పార్టీ నాయకుడిగా, పార్టీ కేడర్ ను కాపాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడక తప్పదు.. మాట్లాడితే జనానికి ఇంకా దూరం అయ్యే ప్రమాదముంది. పాపం.. చంద్రబాబును జగన్ భలే ఇరకాటంలో పడవేసాడు...


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ వేసిన ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top