Translate

  • Latest News

    11, జూన్ 2020, గురువారం

    ఫిలిం సిటీ రామోజీకి వైట్ ఎలిఫెంట్ గా మారిందా..?


    రామోజీ ఫిలిం సిటీ... ఆర్.ఎఫ్.సి... అది రామోజీ డ్రీమ్ ప్రాజెక్టు.. ఆయన మానస పుత్రిక... అమెరికాలో హాలీవుడ్ లా తెలుగు నాట ఆ స్థాయిలో స్టూడియో నిర్మించి ప్రపంచం నలుమూలలా తన పేరు మార్మోగిపోవాలని, తానున్నా, లేకున్నా శతాబ్ధాల పాటు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఒక స్వాభావికమైన స్వార్ధంతో రామోజీ నిర్మించిన స్టూడియో... ఆర్.ఎఫ్.సి నిస్సందేహంగా మన దేశంలోనే గొప్ప ఫిలిం స్టూడియో... ఎన్నో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు హిందీ, ఇతర భాషా చిత్రాలు, ఒకటో, రెండో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ కూడా ఇక్కడ జరిగాయి.

    84 ఏళ్ల వయసులో...
    రామోజీ ప్రస్తుతం 84 ఏళ్ల వయసులో మోయలేని భారం మోస్తున్నాడు. ఈ ఏడాది నవంబర్ 16 కి 84 నిండి 85 ఏళ్ళు వస్తాయి... ఈ వయసులో తన కలల రాణి... తన స్వప్న సుందరి... తన డ్రీమ్ గర్ల్ ఆర్.ఎఫ్.సి యే తనకు వైట్ ఎలిఫెంట్ గా మారింది. ఆర్.ఎఫ్.సి లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్ళు, సెట్టింగ్ లు, ఇతరత్రా నిర్వహణకే రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది.

    రామోజీ ఫిలిం సిటీలో తార పేరుతొ త్రీ స్టార్ హోటల్, సితార పేరుతొ ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నాయి. జనం వచ్చినా, రాకున్నా... వీటిని 365 రోజులు నీట్ గా మెయింటేన్ చేయక తప్పదు. అలాగే 1660 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫిలిం సిటీ నిర్వహణ మామూలు విషయం కాదు. అందునా రామోజీ శుచి, శుభ్రత కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. క్రమశిక్షణకు మారు పేరు. పైగా ఆయన అక్కడే ఉంటారు.. కాబట్టి. ఎక్కడా ఏ చిన్న చెత్త కాగితం ముక్క కూడా కనపడకుండా పారిశుధ్య సిబ్బంది నిరంతరం ఫిలిం సిటీని నీట్ గా ఉంచుతారు. ఈ మొత్తం నిర్వహణకు రోజుకు లక్షల్లోనే వ్యయం అవుతుంది. కరోనా ఎఫెక్ట్ తో సినిమా నిర్మాణాలు ఆగిపోయాయి. మళ్ళి మొదలెట్టినా నిర్మాతలు సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లో నిర్మాణానికి మొగ్గు చూపుతారు. ఆర్.ఎఫ్.సి కి అవసరం అనుకుంటే తప్ప రాకపోవచ్చు. దీనికి తోడు ఈనాడుకు ప్రధాన ఆదాయ వనరు అయిన ప్రకటనలు పూర్తిగా తగ్గిపోయాయి. మార్గదర్శి నష్టాలు లేకపోయినా గత మూడు నెలలుగా కొత్త చిట్ లు ఏవి మొదలు కాలేదు. పాతవి కూడా వసూళ్లు ఆగిపోయాయి. అఫ్ కోర్స్ అవి తర్వాతయినా వసూలు అవుతాయనుకోండి. ప్రియా పచ్చళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఆగిపోయింది. మార్గదర్శి, ఇతరత్రా వ్యాపారాల మీద ఎన్ని కోట్లు  వచ్చినా వాటన్నిటిని వైట్ ఎలిఫెంట్ లా ఆర్.ఎఫ్.సి మింగేస్తోంది. ఇక ఇప్పుడు ఈనాడు దానికి తమ్ముడిలా తయారయింది. ఏది ఏమైనా ఎన్ని కోట్లు అయినా ఆర్.ఎఫ్.సి ఆలా నడపవల్సిందే...అది రామోజీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి అందులో వేలు పెట్టరు. అందుకే ఈనాడులో వేలు పెట్టారు. పొదుపు చర్యలు మొదలెట్టారు. 120 మంది కాంట్రాక్టు సబ్ ఎడిటర్ లను తీసేశారు. ఉన్న వాళ్ళను కూడా లే- ఆఫ్ విధానం పెట్టి నెలలో ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులకే జీతం అనే సరి కొత్త విధానాన్ని సృష్టించారు. చట్టం దృష్టిలో తాను ఉద్యోగులను తీసేసినట్టు కాకుండా.. వారి ఉద్యోగం వారికి ఉంచుతూనే ఇలా ఉద్యోగుల పొట్ట కొడుతున్నాడు.
    ఏకైక ఆశా కిరణం శైలజా కిరణ్

    రామోజీ తదనంతరం ఆ మహా సామ్రాజ్యాన్ని ఒంటి చేతి మీద నడపగలిగే సామర్ధ్యం ఆయన కొడుకు కిరణ్ కు లేదు. ఆ కుటుంబంలో ఏకైక  ఆశా కిరణం శైలజా కిరణ్. ఆమె ప్రస్తుతం మార్గదర్శి వ్యవహారాలు సమర్ధవంతంగా చూస్తోంది. మిగతా వ్యాపారాలు అన్నీ చూసుకోవాలంటే కాస్త కష్టమే.. రామోజీ ఇప్పటికే ఈ టీవీ లో చాలావరకు వాటా రిలయెన్స్ కు అమ్మేశాడు. రామోజీ తదనంతరం ఈనాడు కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా కృష్ణా జిల్లా గుడివాడ ను ఆనుకుని ఉన్న పెదపారుపూడి అనే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి. ఇంతటి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన చెరుకూరి రామోజీ రావు తన జీవిత కాలంలోనే ఉత్థాన, పతనాలను కూడా చవిచూడాల్సి వస్తుందేమో... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఫిలిం సిటీ రామోజీకి వైట్ ఎలిఫెంట్ గా మారిందా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top