Translate

  • Latest News

    28, జూన్ 2020, ఆదివారం

    భిన్నస్వరం చెప్పిందే నిజమైంది...


    కల చెదిరింది... కథ మారింది... ఇప్పుడు రామోజీ ఇక ఈ పాట పాడుకుంటూ కాలక్షేపం చేయాల్సిందేనా... అవును.. నాడు భిన్నస్వరం చెప్పిందే నిజమైంది...  భిన్నస్వరం ఈ నెల 11 వ తేదీన ఫిలిం సిటీ రామోజీకి వైట్ ఎలిఫెంట్ గా మారిందా..? అనే కధనం ఇచ్చిన సంగతి తెలిసిందే... భిన్నస్వరం ఊహించినట్టే జరిగింది... వైట్ ఎలిఫెంట్ గా మారిన ఫిలిం సిటీ ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు రామోజీ మూడేళ్ళ పాటు డిస్నీ హాట్ స్టార్ సంస్థకు  అద్దెకు ఇచ్చాడు... ఆ విధంగా పెనుభారంగా మారిన ఫిలిం సిటీ బరువును తాత్కాలికంగా వదిలించుకున్నాడు. అయితే అద్దెకు తీసుకున్న డిస్నీ హాట్ స్టార్ సంస్థ ఓ నిబంధన విధించింది. ఈ మూడేళ్లు ఇతర నిర్మాణ  సంస్థల షూటింగ్ లకు అనధికారికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్టు  రిపబ్లిక్ వరల్డ్. కామ్  ప్రకటించింది. అంటే... ఈ మూడేళ్లు ఆర్.ఎఫ్.సి ని డిస్నీ తన గుప్పెట్లో బంధించి ఉంచుతుందన్న మాట.. ఇంకా ఎవరికీ అక్కడ షూటింగ్ లు చేసుకునే అవకాశం లేకుండా చేస్తుందన్న మాట...
    (బిన్న‌స్వ‌రంలో రామోజీ ఫిలింసిటిపై వ‌చ్చిన క‌థ‌నం ఇక్క‌డ            https://www.bhinnaswaram.com/2020/06/blog-post_11.html   చూడండి)

    కరోనా ఎంత పని చేసింది...  పాపం...రామోజీ... ఈ పరిణామాన్ని భిన్నస్వరం ముందుగానే ఊహించింది... ఇది జరగక తప్పదని... కాకపొతే రామోజీ తన మానస పుత్రిక మీద వ్యామోహంతో వదలలేక పోతున్నాడని... ఆ విషయంలో ఆయన్ను ఒప్పించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారని చెప్పాము.. అయితే చివరకు రాజాధి రాజా... రాజ మార్తాండ... రామోజీ రావు తలొగ్గక తప్ప లేదు... కలల లోకం నుంచి...  వాస్తవ ప్రపంచం లోకి వచ్చి చూసి... తెలివైన నిర్ణయం తీసుకున్నాడు... తన మానస పుత్రికను అయిష్టంగానే మూడేళ్ళ పాటు డిస్నీ హాట్ స్టార్ సంస్థకు అద్దెకు ఇచ్చాడు... డిస్నీ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ సంస్థ గత ఏడాది  మన దేశంలో హాట్ స్టార్ సంస్థ తో టీ అప్ అయింది.. దీంతో  హాట్ స్టార్  డిస్నీ మన దేశంలో ఓటీటీ రంగంలో తిరుగులేని శక్తి గా అవతరించింది.   ఆ సంస్థ ఈ మూడేళ్లు రామోజీ ఫిలిం సిటీ ని తన ప్రోగ్రామ్ లు...షూటింగ్ లకు వాడుకుంటుంది. కరోనా రామోజీ గ్రూప్ సంస్ధలను ఆర్ధికంగా ఎంత  దెబ్బ తీసిందీ  అనడానికి ఇంత కంటే వేరే నిదర్శనం ఇంకేం కావాలి.. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భిన్నస్వరం చెప్పిందే నిజమైంది... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top