Translate

  • Latest News

    23, జూన్ 2020, మంగళవారం

    హెచ్ 1 బీ వీసాలు రద్దు చేస్తే ఎన్నికల్లో గెలుస్తారా..?


    వచ్చే నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు... అక్కడ నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కదా... అప్పుడే ట్రంప్ నాలుగేళ్ల పాలన ముగిసిపోతుంది... మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే ఏదో ఒక బూచి సాయం కావాలి.. అదే హెచ్ 1 బీ  వీసా బూచి... ఆ బూచి చూపెట్టి అమెరికన్ల ఓట్లన్నీ గంపగుత్తగా వేయించేసుకోవాలి... తాను అమెరికన్లను ఉద్దరించడానికే పుట్టానని కలరింగ్ ఇచ్చుకోవాలి... అందుకే ఇప్పుడుహెచ్ 1 బీ  వీసా రద్దు నిర్ణయం... దీనివల్ల 5 లక్షల మందికి పైగా వలస వాదులు రోడ్డున పడతారు... అందులో 3 లక్షలకు పైగా మన ఇండియా వాళ్లే ఉంటారు... అందులోనూ మెజార్టీ మన తెలుగు వాళ్ళు  ఉంటారు. ఎవరు ఏమైతేనేం... ఎన్నికల్లో  మళ్ళి గెలవాలంటే ఈ బూచి ని వాడుకోవాల్సిందేనని ట్రంప్ దృడాభిప్రాయం.

    తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాలకులకు ఓ బూచి కావాలి . ఆ బూచి... ఒక్కో దేశంలో...ఒక్కో పాలకునికి... ఒక్కో రూపంలో ఉంటుంది. ఇండియా లో అయితే అధికారంలో ఏ పార్టీ ఉన్నా... తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి టెర్రరిజం...నక్సలిజం పెద్ద బూచి... చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే అమ్మ బూచోడి పేరు చెప్పి మనల్ని భయపెట్టి మనతో అన్నం తినిపించినట్టు... పాలకులు నక్సలైట్ల పేరు చెప్పి... ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే మేము తప్ప గత్యంతరం లేదంటూ చెప్పి మనతో ఓట్లు వేయించుకుంటారు... ఒక్కొక్కసారి నక్సలైట్లే  నిజమైన దేశ భక్తులు అంటూ వాళ్ళను పొగిడి కూడా ఓట్లు వేయించుకుంటారు.. (1982 లో అన్న ఎన్.టీ.ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అలాగే అన్నాడు మరి... అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆయనే నక్సలైట్ల మీద నిషేధం పెట్టాడు.) ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పీ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లు అనే సరికొత్త బూచి ని కనిపెట్టి... ఆ బూచిని చూపించి తన మాట వినని వారందరిని దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఇకపోతే బి.జె.పీ కి మొదటి నుంచి పాకిస్తాన్ అనే పెద్ద బూచి... కశ్మిర్ అనే మరో చిన్న బూచి అండ ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు ఇంకో అతి పెద్ద చైనా బూచి కూడా వారికి ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ బూచిల సాయంతో ఎన్ని ఎన్నికలైనా ఇట్టె గెలిచేయవచ్చని పాలకుల ధీమా...
    ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ జగన్ లక్ష కోట్ల అవినీతి... ఆర్ధిక నేరస్తుడు... జైలు పక్షి అనే బూచీలు చూపిస్తుంది... కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఈ బూచీలు పని చేయలేదు. సో... ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం సరి కొత్త బూచీలు వెతుక్కోవాలి మరి. ఇక వై.ఎస్.ఆర్  కాంగ్రెస్  పార్టీ అయితే.. తెలుగుదేశం పార్టీ ఒకే సామాజిక వర్గానికే చెందిన పార్టీ... ధనవంతుల పార్టీ.. పేదల వ్యతిరేక పార్టీ అనే బూచీలు చూపించి మొన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మళ్ళీ ఎన్నికల్లో అవే బూచీలు పని చేయవు.. వై.ఎస్ రెండోసారి 2009 లో ఏ బూచిల మీద ఆధార పడకుండా... కేవలం తన పనితనం మీద... ప్రజలకు తాను  చేసిన మంచి పనుల మీద విశ్వాసంతోనే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు... జగన్ పాలన  తీరు చూస్తుంటే... తాను కూడా తన తండ్రి బాట లోనే నడుస్తున్నట్టు ఉంది. రెండు రోజుల కింద వెలువడిన సీ పీ ఎస్ సర్వే ఫలితాలు కూడా మనకు అవే  చూపెట్టాయి. ఇది మంచి పరిణామమే.. పాలకులు ప్రతిపక్ష బలహీనతల బూచీలపై ఆధారపడి గెలవకుండా... తమ పాలనా దక్షత పై ఆధారపడి గెలవాలనుకోవడం రాజకీయాల్లో శుభ పరిణామం. 2009 లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటీ ఎదురు నిలిచినా... తాను ఒక్కడే... ఒంటరిగా నిలిచి... పైగా... అది తన సొంత పార్టీ కాదు...పైన ఒక అధిష్టానం ఉంది... దానికి సమాధానం చెప్పుకోవాలి... అలాంటిది.. సోనియా గాంధీ ని కూడా సమాధానపరచి... గెలిచి మరీ చూపించాడు... అది వీరుడి గెలుపు...  నిజమైన...నిఖార్సయిన  గెలుపు... అధికారంలో వున్న ప్రతి ఒక్కరూ బూచీలను చూపించి కాకుండా తమ పని తీరు ప్రాతిపదికగా... ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలిస్తే...ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హెచ్ 1 బీ వీసాలు రద్దు చేస్తే ఎన్నికల్లో గెలుస్తారా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top