Translate

  • Latest News

    10, జులై 2020, శుక్రవారం

    ఎమ్యూజ్మెంట్ పార్క్ పాయె...


    ఈ జగన్ వచ్చి మా ఎమ్యూజ్మెంట్ పార్క్ ప్లాన్ అంతా పాడు చేశాడు . మొత్తం తలకిందులు చేశాడు. రాష్ట్రాన్ని వందేళ్లు వెనక్కి నెట్టాడు... మా చంద్రబాబు గోరు... ప్రపంచంలో గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మిద్దామనుకుంటే... దాన్ని కుళ్లబెట్టి శ్మశానం గా మార్చాడు. ఐనవోలు(అమరావతి ) లో 200 కోట్ల ప్రాజెక్టు అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మిస్తామని చంద్రబాబు గోరు చెప్పి... 2015 ఏప్రిల్ 14 న శంకుస్థాపన చేసి ఎస్సి, ఎస్టీ లను మాయ చేసి ఒక్క ఇటుక కూడా వేయకుండానే నాలుగేళ్లు నెట్టుకొస్తే... ఈ  జగన్ కి ఏమైనా పిచ్చా... దాన్ని తీసుకెళ్లి విజయవాడ నడిబొడ్డున పెడతానంటాడు... పైగా 2022 ఏప్రిల్ 14 కల్లా పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తానంటాడు..

    అసలు... మేము స్వరాజ్ మైదాన్ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. దానిని చైనా వాళ్లకు 99 ఏళ్లకు లీజ్ కు ఇచ్చేసి... అందులో ఎమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేసి... గొప్ప పర్యాటక కేంద్రంగా మారుద్దామని ఎన్నెన్ని కలలు కన్నాము.. డామిట్... నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్థలాన్ని వాణిజ్య పరంగా ఉపయోగించుకుంటే... రాష్టానికి డబ్బుల పంట పండుతుంది... కానీ అంబెడ్కర్ విగ్రహం పెడితే ఏమొస్తుంది... ఈ జగన్ చేసే పనులన్నీ అంతే ఒక్కటే డబ్బులు వచ్చే పనులు చేయడు... అన్నీ పనికిమాలిన పనులే... ఒక్కటీ రాష్టానికి ఆదాయం తెచ్చి పెట్టె పనులు చేయడు...ఆదాయం వచ్చే మద్యం అసలు పూర్తిగా నిషేధించేస్తా అంటాడు...  అసలు డబ్బులు లేకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా పాలిద్దామనుకుంటున్నాడు... పాలనానుభవం లేని కుర్ర కుంకల్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చేబెడితే ఇంతే... ఉడుకు రక్తం తో ఏదేదో చేసేద్దామనుకుంటారు.. ఆశయాలు... కీర్తి ప్రెతిష్ఠలు...గాడిద గుడ్డు... అంటారు... ప్రతి ఇంట్లో మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలంటాడు... ఈ జగన్ కి కీర్తి పిచ్చి... కీర్తి ఏమైనా కూడు పెట్టుద్దా . ఈ ప్రపంచం అంతా  డబ్బు మీద నడుస్తోంది... డబ్బు పిచ్చి ఉన్నోడే బాగుపడతాడు... కీర్తి వస్తే ఏముంటుంది... రేపు చచ్చాక జనం నిన్ను పొగుడుతున్నారో ... తిడుతున్నారో.. చూసుకుని సంతోషపడలేవు కదా... బతికి ఉన్నప్పుడే మనం డబ్బు కూడబెట్టాలి... మన కుటుంబానికి తరతరాలు తిని కూర్చున్నా తరగనంత ఆస్తి కూడబెట్టి ఇవ్వాలి... ఆ తర్వాత మన వాళ్ళు.... అదేనండి... మన సామాజివర్గం అంతా సంపాదించుకునేలా... అధికారం ఉన్నప్పుడే... వాళ్ళందిరికి మేలు జరిగేలా.. దీర్ఘ కాలిక ప్రణాళికలు రచించాలి... ఈ జగన్ ఏమిటీ  బీ.సి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలు కూడా సంపాదించుకోవాలంటాడు... వాళ్ళందరూ నాలుగు డబ్బులు సంపాదిస్తే.. ఇంకా మన మాట వింటారా... మన వాళ్ళ మాట వింటారా.. మా చంద్రబాబు ఏం మాట్లాడినా... ఆయనది అంతా కమర్షియల్ బ్రెయిన్ అంటారు... ప్రతిదీ డబ్బు కోణంలోనే ఆలోచిస్తాడని విమర్శిస్తారు... జగన్ మనసు పెట్టి ఆలోచిస్తాడట...అందుకే  ఖజానాలో డబ్బున్నా లేకపోయినా లక్షల కోట్లు అప్పు తెచ్చి అయినా పేదలకు దోచి పెడతాడట... ముఖ్యమంత్రి సీట్లో ఉన్నోడు తాను సంపాదించుకోవాలి... తన చుట్టూ ఉన్నవాళ్లను సంపాదించుకోనివ్వాలి గాని... జనాన్ని సంపాదించుకునేలా చేస్తానంటాడేమిటి.. పిచ్చి గాని.. ఏమిటో... ఈ రాష్ట్రం ఎటు పోతుందో... ఏమిటో... ఆ భగవంతుడే కాపాడాలి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఎమ్యూజ్మెంట్ పార్క్ పాయె... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top