Translate

  • Latest News

    17, జులై 2020, శుక్రవారం

    మాటల్లేవ్...మెసేజ్ లు లేవు... అంతా ఎమోజీలే...


    ఇప్పుడు నడుస్తున్నది ఎమోజీల యుగం...ఈ ఎమోజీలు ఏమిటే.. మనకు రామోజీ తెలుసు...సాయాజీ తెలుసు...ఏ ఎమోజీ ఎవర్రా బాబూ... అనుకుంటున్నారా... ఎమోజీ అంటే మనిషి కాదు... గుర్తు... మీ మనసు లోని భావాలకు ప్రతిస్పందనలు... మీకు సంతోషం వచ్చినా.... దుఃఖం వచ్చినా... కోపం వచ్చినా...  బాధ పడినా... ప్రేమ పొంగుకొచ్చినా ... ఆవేశం కట్టలు తెంచుకున్నా... మీరు అవతలి వారితో నేరుగా మాట్లాడకుండానే మీ మనసులో ఏముందో వాళ్లకు చెప్పగలిగే సరికొత్త భాష... 21 వ శతాబ్దంలో ఆధునిక మానవుడు కనిపెట్టిన సరికొత్త భాష... ప్రపంచంలో ఉన్న వేల  భాషలకు చెందిన వందల కోట్ల ప్రజలకు అందరకీ అర్ధమైయ్యే ఒకే ఒక్క భాష... అదే ఎమోజి భాష... ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ శతాబ్దంలో భాషా ప్రపంచంలో ఒక సరి కొత్త విప్లవం... దీనికి మాటలతో పని లేదు... మెస్సేజ్ లతో పని లేదు... కేవలం గుర్తులు మాత్రమే... అందుకే ప్రపంచంలో అన్ని భాషల వారు అర్ధం చేసుకోగలుగుతున్నారు... అందరూ ఎవరికీ వారు దీనిని ఓన్ చేసుకున్నారు... ఇది అందరి భాష అయింది. అందరి బంధువయింది.ఇంతకూ ఈ సోదంతా ఇవాళ ఎందుకు చెబుతున్నానంటారా... ఈ రోజు ఎమోజి డే అట...
    అర్ధం తెలియకుండా వాడితే అపార్ధాలే...
    అసలు ఏ ఎమోజి అయినా ఒక్కొక్క ఎమోజి కి ఒక్కొక్క అర్ధం ఉంటుంది. దేని అర్ధం దానిదే...కొందరు ఈ గుర్తుల్ని వాటి సరైన అర్ధం తెలిసీ తెలియకుండా ఎడా పెడా వాడేసి నవ్వులపాలు అవుతుంటారు...అనవసరంగా చిక్కుల్లో పడుతుంటారు...అలాగే కొన్ని ఎమోజీ లకు పైకి కనపడే అర్ధం కాకుండా గూడార్ధాలు కూడా ఉంటాయి... వాటిలో కొన్ని మంచివి ఉంటాయి.. కొన్ని చెడ్డవి ఉంటాయి... ఇదంతా తెలుసుకోవాలంటే మీరు అన్ని శాస్త్రాలు చదివినట్టే ఎమోజోపాఖ్యానం  చదవాల్సిందే... అదెక్కడ దొరుకుతుందంటారా... గూగుల్ తల్లిని అడగండి... అంతేకాని...  చేతిలో సెల్ ఫోన్ ఉంది గదా అని...చేతి వేలికి పని చెబితే... ఆ వేలు పడాల్సిన గుర్తు మీద కాకుండా వేరే గుర్తు మీద పడవచ్చు... ఒక్కొక్కసారి మీరు రాత్రి వేళ  చీకట్లో ఫోన్ ఆపరేట్ చేసేటప్పుడు... సరిగా కనపడక... పైగా ఈ  ఎమోజీలన్నీ ఇంచుమించుగా ఒకేలా కనిపిస్తాయి కాబట్టి... మీరు ఒకటి అనుకుని...ఇంకోదాని మీద నొక్కితే... అవతలి వాళ్ళు మిమ్మల్ని అపార్ధం చేసుకునే అవకాశం ఉంది.. అంతే కాదు అది సీరియస్ మ్యాటర్ అయితే కేసులు...కోర్టులు దాకా వెళ్లే ప్రమాదం కూడా ఉంది... కాబట్టి మై డియర్ సోషల్ మీడియా యూజర్స్ ...  ఎమోజీ లతో ఆటలొద్దు... వేలుతో నొక్కేటప్పుడు ఒకింత జాగురూకతతో.. అప్రమత్తంగా ఉండి.. జాగ్రత్తగా చూసి మరీ నొక్కండి... ఓకే.. ఎంజాయ్...


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మాటల్లేవ్...మెసేజ్ లు లేవు... అంతా ఎమోజీలే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top