Translate

  • Latest News

    16, జులై 2020, గురువారం

    నో మోర్ ఆర్గుమెంట్స్... 26 జిల్లాలు ఖాయం..అంతే ...


    ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజనకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.. అందుకోసం ఒక అధ్యయన కమిటీని వేసింది. కమిటీల సంగతి తెలిసిందేగా... అవి నామమాత్రమే... చంద్రబాబు ప్రభుత్వంలో నైనా... జగన్ హయాంలోనైనా... ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్... పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు చేయాలని జగన్ ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నారు. ఈ విషయమై కొన్ని జిల్లాల్లో అభ్యంతరాలు ఉన్నప్పటికీ... అక్కడక్కడా భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికి అందులో ఎటువంటి మార్పు లేదు... ఒక్క అరకు విషయంలో తప్ప... ఈ విషయం నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి పేర్ని నాని ద్వారా సూచనప్రాయంగా స్పష్టం చేశారు.. సో.. ఇక ధర్మాన కృష్ణదాసు నోరు మూసుకు కూర్చోవాల్సిందే... నో మోర్ ఆర్గుమెంట్స్... 
    అరకు నియోజకవర్గం మాత్రం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నందున... ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి సూచన ను పరిగణన లోకి తీసుకుని అవసరమైతే దానిని రెండు జిల్లాలు చేద్దాం... 25 బదులు 26 జిల్లాలు అవుతాయి అంతే... మిగతావన్నీ యాజిటీజ్ గా ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా జిల్లాలుగా విభజన జరిగి తీరుతుంది... ఇందులో ఎటువంటి చేర్పులు...మార్పులకు చోటు లేదు... ఇదీ నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అన్యాపదేశంగా ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశం... 
    పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా జిల్లాల విభజన విషయానికి వచ్చేటప్పటికి కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ప్రధానంగా అసమ్మతి స్వరం వినపడుతోంది... మిగతా జిల్లాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి నామమాత్రమే... కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు ఏలూరు జిల్లాలో కలుస్తుంది... దీనిని అక్కడివారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ... పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇక బాపట్ల నియోజక వర్గంలో కేవలం 3 అసెంబ్లీలు మాత్రమే గుంటూరు జిల్లావి ఉంటే... 4 అసెంబ్లీలు ప్రకాశం జిల్లావి ఉన్నాయి.. వాటిలో చీరాల, పర్చూరు, అద్దంకి  వరకు కొంత ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటారనుకున్నా... సంతనూతలపాడు నియోజకవర్గం మాత్రం ఒంగోలు ను ఆనుకుని ఉంటుంది... దానికి తీసుకువచ్చి బాపట్లలో కలపడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు... దేశంలోనే గ్రానైట్ పరిశ్రమకు పేరుగాంచిన చీమకుర్తి కూడా సంతనూతలపాడు నియోజకవర్గం లోనిదే. గ్రానైట్ పరిశ్రమ యజమానులు  ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతాం... మా నియోజకవర్గం బాపట్ల లో కలపడానికి వీల్లేదు అని శపధాలు చేస్తున్నారు... కానీ పాపం.... వాళ్లకు ఇంకా జగన్ సంగతి అర్ధం కాలేదు అనుకుంటా... జగన్ డెసిషన్ తీసుకున్నాక ఇంకా దానికి తిరుగుండదని... ఎవరెన్ని చెప్పినా సంతనూతలపాడు బాపట్ల జిల్లాలోకి వెళ్లడం ఖాయం... బాపట్ల-చీరాల మధ్యలో స్టూవర్టుపురం-ఈపూరుపాలెం మధ్య జిల్లా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి... స్టూవర్టుపురంలో ఎస్.పీ ఆఫీస్ పెట్టే  ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది... ఇక ప్రకాశం జిల్లా కందుకూరు నెల్లూరులో కలుస్తుంది... అక్కడ కొంత వ్యతిరేకత ఉన్నా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. రాయలసీమలో చిత్తూరు, వై.ఎస్.ఆర్ జిల్లాలలో కొంత అటూ...ఇటూ కలిసినా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. సో..కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభమయింది.వచ్చే మార్చి నాటికి అన్ని హంగులతో అధికారికంగా కొత్త జిల్లా కేంద్రాల నుంచి పాలన ప్రారంభమవుతుందన్న మాట.  
    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    Item Reviewed: నో మోర్ ఆర్గుమెంట్స్... 26 జిల్లాలు ఖాయం..అంతే ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top