Translate

  • Latest News

    13, జులై 2020, సోమవారం

    బ్రిటిష్ వారి తరహాలోనే బి.జె.పీ నియంతృత్వ పాలన


    నాడు బ్రిటిష్ వారు భారతదేశంలో సాగించిన నియంతృత్వ పాలన తరహాలోనే ప్రస్తుతం ఇండియాలో దుర్మార్గపు పాలన సాగుతోంది. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్యోద్యమకారాలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి  అండమాన్ జైల్లో నిర్బంధించేవారు... అండమాన్ జైల్లో ఉండడం అంటే ఇక ఇంటి ముఖం చూసే పని లేదు... అక్కడే బతికినంత కాలం బతికి అక్కడే చచ్చిపోవడమే... ఇప్పుడు మన దేశంలో అధికారంలో ఉన్న బి.జె.పీ  పాలకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు... ఎందుకంటే... వీరు వారి వారసులే కదా... నాడు స్వాతంత్రోద్యమంలో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి మద్దతు పలికిన ఘన చరిత్ర బి.జె.పీ పూర్వ నామధేయమైన జనసంఘ్ కు ఉంది. నాటి హిందూ మహాసభ నాయకుడైన వినాయక్ దామోదర్ సర్కార్ కు స్వాతంత్రోద్యమంలో పని చేసినందుకు అండమాన్ జైల్లో  జీవిత కాల శిక్ష పడితే పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టుకుని.. బ్రిటిష్ వారికి నీ బాంచెన్ కాల్మొక్త అన్న రీతిలో  సాగిలపడి... ప్రాధేయపడి శిక్ష రద్దు చేయించుకున్న ఘనుడాయన.... ఆయన ఇప్పటి బి.జె.పీకి ఆరాధ్య పురుషుడు... ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికొయ్యను ముద్దాడిన భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ లు ఎక్కడ... చావుకు భయపడి బ్రిటిష్ వారిని ప్రాధేయపడి మెర్సీ పిటిషన్ పెట్టుకుని బయటపడిన వీర సావర్కర్ ఎక్కడ...
    ఇప్పడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. నాడు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారినందరిని అండమాన్ జైల్లో జీవితకాల కారాగార శిక్ష వేసినట్టుగానే... ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజె.పీ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారినందరిని రాజ ద్రోహం అంటూ ఏదో ఒక నెపం మోపి జైళ్లలో తోస్తోంది. వికలాంగులు... వయోవృద్దులు అని కూడా చూడకుండా... 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను, 82 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్, రచయిత, కవి వరవరరావు ను ఏళ్ల తరబడి జైళ్లలోనే ఉంచుతోంది. కనీసం వారి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పట్టించుకోవడం లేదు... నిన్న వరవరరావు కుటుంబ సభ్యుల వేదన వింటుంటే గుండె తరుక్కుపోతోంది. ఫోన్ లో స్వయంగా ఆయన భార్య హేమలత మాట్లాడినా కూడా గుర్తు పట్టకుండా ఎవరితోనే మాట్లాడినట్టు హిందీలో మాట్లాడారట... పైగా ఆయనకు 8 ఏళ్ల వయసులో చనిపోయిన ఆయన తండ్రి అంత్యక్రియల గురించి, 35 ఏళ్ల కిందట చనిపోయిన తల్లి గురించి వాళ్ళు ఇప్పుడు చనిపోయినట్టుగా మాట్లాడుతున్నారట... దీనిని బట్టి ఆయన మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అటువంటి స్థితిలో కూడా ఆయనకు బెయిల్ ఇవ్వకుండా... వైద్యం చేయించకుండా అలాగే వుంచుతున్నారంటే... దానికి అర్ధం నాడు బ్రిటీష్ వారు అవలంబించిన  అండమాన్ జైలు  పద్ధతినే వీరూ అవలంబిస్తున్నారన్న మాటేగా... ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాదు... ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ రచించిన ప్రజాస్వామ్య దేశం అని, ఈ దేశంలో పౌరులకు కొన్ని ప్రాధమిక హక్కులు ఉంటాయని...  దేశ పౌరులంతా ఒక్కసారి బి.జె.పీ పాలకులకు గుర్తుచేయాలేమో... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బ్రిటిష్ వారి తరహాలోనే బి.జె.పీ నియంతృత్వ పాలన Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top