Translate

  • Latest News

    11, జులై 2020, శనివారం

    కమల్ హాసన్ పెద్ద మనసు


    ప్రముఖ తమిళ నటుడు, విలన్‌ పాత్రలను పోషించిన పొన్నంబళమ్‌ అనారోగ్యం కారణం గా ఆసుపత్రిపాలయ్యారు. కిడ్నీ సంబంధ సమస్యలతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ ఫోన్‌లో అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. డబ్బు సాయం చేస్తానని మాటిచ్చారు. అతని పిల్లలను చదివించే బాధ్యత తనదేనని తెలిపారు. పొన్నంబళమ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి కమల్‌ హాసన్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అతను ''స్టంట్‌మ్యాన్‌'' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కమల్‌ హాసన్‌తో కలిసి 'అపూర్వ సాగోధరార్గల్‌', 'మైకేల్‌ మదన కామరాజన్‌' వంటి చిత్రాల్లో నటించారు. పొన్నంబళమ్‌ తమిళ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లోనూ పాల్గొన్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కమల్ హాసన్ పెద్ద మనసు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top