Translate

  • Latest News

    18, జులై 2020, శనివారం

    నకిలీ అఫిషియల్​ ట్విట్టర్​ అకౌంట్ పై ఆలీ ఫిర్యాదు


    తన పేరిట నకిలీ అఫిషియల్​ ట్విట్టర్​ అకౌంట్​ నడుస్తోందని తెలుసుకుని సినీ నటుడు ఆలీ షాక్​ తిన్నారు. వెంటనే సైబరాబాద్​లోని క్రైమ్​ డిపార్టుమెంటు డిప్యూటీ కమిషనర్​ రోహిణి ప్రియదర్శినికి శనివారం ఫిర్యాదు చేశారు. 2017 నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆలీ పేరిట అధికారిక ట్విట్టర్​ అకౌంట్​ను నడుపుతున్నాడు. సందర్భానుసారంగా వీడియోలు, మెసేజ్​లు పెడుతున్నాడు. పలువురు నటీనటులకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెట్టాడు. ఆ అకౌంట్​ తనది కాదని, తన పేరిట అకౌంట్​ రన్​ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆలీ తన ఫిర్యాదులో కోరారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నకిలీ అఫిషియల్​ ట్విట్టర్​ అకౌంట్ పై ఆలీ ఫిర్యాదు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top