హోమియో వైద్యాన్ని అల్లోపతి...అదేనండి... ఇంగ్లీష్ వైద్యం తొక్కేస్తోంది... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ అల్లోపతి మాఫియా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలను శాసిస్తోంది. మనకు డ్రగ్స్ మాఫియా గురించి తెలుసు.. వాటిని నడిపించే డాన్ ల గురించి తెలుసు. కానీ అది చట్ట వ్యతిరేక మాఫియా... కానీ ఈ అల్లోపతి మాఫియా అనేది చట్టబద్ధమైన మాఫియా... వెల్ ఆర్గనైజ్డ్ మాఫియా... ఏ దేశమైనా... ఏ దేశాధినేత అయినా అది చెప్పినట్టు వినాల్సిందే... ముఖ్యంగా ఇలాంటి ఎపిడమిక్ డిసీజెస్ వ్యాప్తి చెందినపుడు ఈ మాఫియా చెప్పిందే వేదం... ఆడిందే ఆట... పాడిందే పాట.
అప్పుడు ఆలా... ఇప్పుడు ఇలా...
మూడు దశాబ్దాల కిందట మెదడు వాపు వ్యాధి ప్రబలినపుడు ఇంగ్లీష్ వైద్యం చేతులెత్తేస్తే జనాల్ని కాపాడింది హోమియో వైద్యమే... అప్పుడు గతి లేక అల్లోపతి వారు కూడా హోమియోనే శరణ్యమని ఒప్పుకోక తప్పలేదు... ఆ తర్వాత స్వైన్ ఫ్లూ వంటి వైరస్ లు ప్రబలినపుడు కూడా ఇంగ్లీష్ వైద్యంలో మందులు వచ్చేవరకు ప్రజలకు హోమియోనే దిక్కు అయింది. కరోనా వైరస్ వ్యాపించిన తొలి నాళ్ళల్లో కూడా కేంద్ర ప్రభుత్వం స్వయంగా హోమియోలో ఆర్సెనిక్ ఆల్బం అనే మందు వైరస్ నిరోధక ముందుగా వాడమని చెప్పడమే కాక ఆయుష్ శాఖ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున పంపిణీ చేసింది. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోమియో రీసెర్చ్ సెంటర్ లు 12 ఉన్నాయి. వీటిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కటి ఆంధ్రప్రదేశ్ లో గుడివాడలో ఉంది.
అల్లోపతి మాఫియానే అడ్డుకుంటుందా?
ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఇప్పటికే ఎంతోమంది హోమియో వైద్యులు తమను నమ్మి వచ్చిన కరోనా రోగులకు కేవలం హోమియో వైద్యం ద్వారానే కరోనా ను నయం చేసి చూపించారు కూడా...అయితే ప్రైవేట్ హోమియో వైద్యులు చేస్తున్న పాటి కృషి కూడా ప్రభుత్వ హోమియో రీసెర్చ్ సెంటర్ లు ఎందుకు చేయడం లేదు. తాము ప్రయోగాత్మకంగా చేసి చూపించవచ్చు కదా... వాళ్ళ చేతులు ఎవరు కట్టిపడేశారు... కేంద్ర ప్రభుత్వమా... అల్లోపతి మాఫియానా.. ఈ విషయం తేలాల్సి ఉంది. హోమియో వైద్యంతోనే అంతా నయం అయిపోతే లక్షల కోట్ల అల్లోపతి వ్యాక్సిన్ వ్యాపారం ఏమైపోవాలి... అందుకే అల్లోపతి మాఫియా రంగ ప్రవేశం చేసింది. దీంతో ప్రభుత్వాలు హోమియో గురించి మాట్లాడడం మానివేశాయి. కేవలం అయిడు వందల రూపాయల లోపు మందులతోనే హోమియో వైద్యంలో కరోనా ను కట్టడి చేయవచ్చు. ఈ విధంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది హోమియో వైద్యులు చేసి చూపిస్తున్నారు కూడా... కానీ ప్రభుత్వాలకు ఇవేమి పట్టవు.
ఇదో భయంకరమైన కుట్ర
ఇది ఒక అంతర్జాతీయ కుట్ర. ఒక పధకం ప్రకారం ముందుగా కరోనా అంటే ప్రజల్లో భయం కల్పించారు. వ్యాక్సిన్ వస్తే కానీ దీని నుంచి ప్రజలకు విముక్తి లేదు అని వారే తేల్చేశారు. ఇక వ్యాక్సిన్ తయారీలో ఫార్మా కంపెనీ ల మధ్య యుద్ధం మొదలయింది. రష్యా ముందుగా నేను వ్యాక్సిన్ తయారు చేసేశాను అంది. వెంటనే డబ్ల్యూ హెచ్ ఓ దానికి మా గుర్తింపు లేదు అంది. ఇండియాలో భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసింది. ఇంకొన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయి. ఏదయినా ప్రపంచమంతా ఇప్పుడు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్టు అల్లోపతి మాఫియా పకడ్బందీగా కుట్ర చేసింది. తద్వారా లక్షల కోట్ల వ్యాపారానికి మాప్ రెడీ చేసింది. ప్రజలు ఈ ఇంగ్లీష్ వైద్యం మీద భ్రమలు వీడి... ఎవరికీ వారు హోమియో మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం మన హోమియో వైద్యులు చాలా సింపుల్ గా కరోనా ను తరిమికొట్టగలరు... హోమియో మాత్రల తోనే కరోనా ను కట్టడి చేయగలరు. ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం.
Wonderful message to the innocent mass and we'll planned
రిప్లయితొలగించండిblow to allopathy (English) jaunta.