Translate

  • Latest News

    31, ఆగస్టు 2017, గురువారం

    నోట్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన సొమ్ము 16 వేల కోట్లు ..... కొత్త నోట్ల ముద్రణతో ఆర్‌బీఐ ఖర్చు రూ.21 వేల కోట్లు



    ఎదో చేస్తాం.. అద్భుతాలు సృష్టి స్తాం ...  అంటూ మాటల గారడీ చేసిన ప్రధాని మోడీ , అయన కు భజన చేసిన బృదం  నోటికి తాళం పడిందా .... ( ఈ . బృందం లో ఇరు తెలుగు రాష్ట్రాల చంద్రులు ఉన్నారు. ) . నల్లధనాన్ని తెలుపు చేయడానికే మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్య సామాన్యులకు చుక్కలు చూపించింది. నోట్ల యుద్దమ్ చేయలేక క్యూ లైన్ లో నే 104 మంది తనువు చాలించారు. సరే త్యాగాలకు సిద్ధం కావాలని పెద్దయన చెప్పాడు కదా పొతే కొన్ని ప్రాణాలే కదా అని ఎవరికి వారే సముదాయించికొని వేచి చూసారు. అద్భుతం  జరగక పొతే , నల్ల కుబేరుల నల్లధనాన్ని వెలికి తీయక పొతే తనను బహిరంగా ఉరి తీయమని  చెప్పయ్యాయే . కాస్త ఆగితే కష్ఠాలు తొలిగి పోతాయని ఆశించారు,.నెలలు గడిచి పోయాయి . సామాన్య, మద్యతగతి జీవుల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి . ఈ క్రమంలో భజన చేసిన పెద్దలకు , వత్తాసు పలికిన రెండు తెలుగు రాష్ట్రాల చంద్రులకు సర్వం భోద పడింది.
     తాజాగా  నోట్ల రద్దు వివరాలను ఆర్బీఐ తన 2016-17 వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. 2016 నవంబరు 8 నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా.. వెనక్కి తిరిగి వచ్చిన నోట్ల విలువ రూ.15.28 లక్షల కోట్లు అని పేర్కొంది. అంటే.. ప్రభుత్వానికి నికరంగా మిగిలింది కేవలం రూ.16,050 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా ఒక శాతం మాత్రమేమొత్తం చలామణీలో ఉన్న 632.7 కోట్ల వెయ్యి రూపాయల నోట్లలో 8.9 కోట్ల నోట్లు తప్ప మిగిలినవన్నీ వెనక్కి వచ్చాయి. అంటే, ప్రభుత్వం వద్దకు రాకుండా ఉండిపోయిన వెయ్యి రూపాయల నోట్ల విలువ రూ.8,900 కోట్లు.2015-16 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు అయిన ఖర్చు రూ.3,421 కోట్లు కాగా.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు అయిన ఖర్చు రూ.7,965 కోట్లు.
    2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 7.62 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను ఆర్బీఐ గుర్తించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 20.4 శాతం ఎక్కువ. 2015-16 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన నకిలీ నోట్ల సంఖ్య.. 6.32 లక్షలు.

    ఇది ఆర్బీఐ నివేదిక లో ముఖ్య అంశాలు అంటే   మొత్తం మీద ఇంత చేసి ప్రభుతం వెలికి తీసిన నల్లధనం  ఎంతో తెలుసా కేవలం 16 వేల కోట్ల మాత్రమే . కూలి పని చేసే సగటు మనిషి కూడా ఇది నమ్మే పరిస్థితులు లేవు. ఆ కూలి కే  తెలుసు తన షావుకారు వద్ద ఎంత నల్ల డబ్బు మూల్గుతొందో ... ? కానీ ప్రభుత్వం మాత్రం ఇదే నిజమని వాదిస్తుంది . లో గుట్టు పెరుమాళ్కెరుక ... ఈ వవ్యహారం లో సమిధలు మాత్రం సామాన్యులే .. కోస మెరుపు ఏమిటంటే  నోట్ల  రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన సొమ్ము 16 వేల కోట్లయితే కొత్త నోట్ల ముద్రణతో ఆర్‌బీఐ రూ.21 వేల కోట్లు నష్టపోయింది   .....

                                                                                    శ్రీహర్ష 

                                                           


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నోట్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన సొమ్ము 16 వేల కోట్లు ..... కొత్త నోట్ల ముద్రణతో ఆర్‌బీఐ ఖర్చు రూ.21 వేల కోట్లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top