ఒక పథకం ప్రకారం దేశంలో అత్యున్నత పదవులన్నింటిలోనూ ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన వ్యక్తులతో నింపేసిన ప్రధాని మోదీ ఇక పక్కాగా ఆర్ఎస్ఎస్ ప్రణాళికను అమలుచేయడానికి ఉద్యక్తులవుతున్నారు. ఇందులో భాగంగా బీసీలపై క్రీమీలేయర్ కత్తితో ఒక్క పోటు పొడిచారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ బ్యాంకుల్లోనూ క్రీమీలేయర్ అమలు చేస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీలపై చేసిన దారుణమైన కుట్ర. బీసీల్లో రూ.8 లక్షల వార్షికాదాయం దాటిన వారి పిల్లలు ఇక కనీసం బ్యాంకు ఉద్యోగాలకు కూడా ఓబీసీ రిజర్వేషన్ పొందలేరు.
కేవలం క్లర్క్ పోస్టులు, అటెండర్ పోస్టులకు మాత్రమే బీసీ యువతను పరిమితం చేసే భయంకరమైన కుట్ర ఇది. తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులు, గ్రూప్ ఎ పోస్టులు, ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీల్లో జూనియర్ మేనేజిమెంట్ గ్రేడ్-1, ఆపై స్థాయి ఉద్యోగులను గ్రూప్ ఎ ఉద్యోగులతో సమానంగా భావిస్తూ క్రీమీలేయర్ వర్తింపజేస్తున్నారు.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి