Translate

  • Latest News

    30, ఆగస్టు 2017, బుధవారం

    మద్యం వ్యాపారులకు ఊరట....నగర పరిధిలోని జాతీయ రహదారులపై కూడా షాపులు


    నగర మద్యం వ్యాపారులకు ఊరట లభించింది. దుకాణాల ఏర్పాటుకు అనుమతిపై వారు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. దేశంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు వెళుతున్నా వాటి వెంబడి మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చని తీర్చునిచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై రెండు నెలలుగా వివిధ కోర్టు ల చుటూ తిరుగుతున్న మద్యం వ్యాపారులకు లైన్ క్లియరైంది. నగ రాలు, పట్టణాలలో లారీలు తిరగవు కనుక ఈ ప్రాంతా ల్లో మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరుతూ చెన్నైకి చెందిన మద్యం వ్యాపా రులు సుప్రీంకోరులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు కాపీలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. దీనిపై ప్రభుత్వం కస రతు చేస్తోంది. మరో మూడు, నాలుగు రోజల్లో దీనిపై అనుమతి ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో మాదిరి యధావిధిగా షాపులు, బార్లు ఏర్పాటు చేసుకునేం దుకు వ్యాపారులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
    ఆబ్కారీ శాఖ సుప్రీంకోరు ఆదేశాల అనుసారం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం జాతీ య, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లు లోపు మద్యం షాపులు, బార్లు ఏర్పాటు చేసుకునే వీలు లేకుండా పోయింది. జూలై నుంచి ఈ పాలసీ అమల్లోకి రావడంతో గందరగోళం నెలకొంది. రహదారుల పక్కన షాపులు, బార్లు పెట్టేందు వీలు లేకుండా పోగా, జనావాసాల మధ్యన పెడితే ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడంతో అప్పటికే లైసెన్సులు దక్కించు కున్న వ్యాపారులు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్నిరోజుల పాటు పలుచోట్ల మద్యం షాపులు తెరుచు కోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్, మున్సిపాలి టీలు, మండల కేంద్రాల గుండా వెళ్లే రాష్ట్ర రహదారు లను జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్)గా డీనో టిపై చేసింది. లైసెన్స్ ఫీజులు చెల్లించి కూడా వ్యాపారం చేసుకోలేక పోయారు. జాతీయ రహదారిని డీనోటిఫై చేయడం కేంద్రం పరిధిలోని అంశం కావడంతో ఆ దిశగా వ్యాపా రులంతా ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో హై కోరును కూడా ఆశ్రయించారు. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టే పట్టణ, నగర పరిధిలోని జాతీయ రహదారులపై కూడా షాపులు, బార్లు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్ప డంతో వీరంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. కొందరైతే ఇప్పటికే దూరంగా ఏర్పాటు చేసి ఉన్న షాపులను మళ్లీ రోడ్ల పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారం బించారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మద్యం వ్యాపారులకు ఊరట....నగర పరిధిలోని జాతీయ రహదారులపై కూడా షాపులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top