Translate

  • Latest News

    27, ఆగస్టు 2017, ఆదివారం

    నంద్యాల.టీడీపీ ఒంటరి పోరుతో భవిష్యత్తులో మారనున్న రాజకీయం ...


    నంద్యాల ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే  తిరిగేలేదు. ..  టీడీపీ ఒంటరి పోరుతో భవిష్యత్తులో మారనున్న రాజకీయం ........
    నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పడు రాష్ట్రంలో ఇప్పడు హాట్ టాపిక్ రాజకీయనాయకులే కాదు సామాన్యులు సైతం ఉత్కంతభరితంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు కాదన్న అవునన్నా అధికార టీడీపీకి, ప్రతి పక్ష వైకాపాకు జీవర్మణ సమస్య . అధికార తెలుగుదేశం ఈ ఎన్నికల్లో విజయం సాధించినా అనేక అంశాలు ఇందులో క్రోడికృతమై ఉన్న సంగతిని విస్మరించలేం. మూడున్నర సంవత్సరాల అధికార టీడీపీ కి ఈ ఎన్నికలు ఒక రిఫరండం మాత్రమే కాదు, ప్రజల మనోభావాలకు నిలవుటద్దమని చెప్పవచ్చు. వైకాపా ఎన్నికల్లో విజయం సాధిస్తే 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకుసాగటానికి ఈ గెలుపు ఉత్సహాన్ని నింపవచ్చు. టీడీపీ గెలిస్తే ఇక తిరుగేలేదు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మరో కోణం దాగిఉంది. ఈ విజయం ఒక్క టీడీపీకే చెందే అవకాశం ఉంది. మిత్రపక్షంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ ఎన్నికల్లో మద్దతు ప్రకటించకపోవటం, మద్దతు ప్రకటించినా బీజేపీని ముస్లిం ప్రాలభ్యం ఉన్న నంద్యాలలో ప్రచారంలో టీడీపీ వినియోగించుకోకపోవటం తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు మరోవిధంగా పార్టీ క్యాడర్లో, అధినేత చంద్రబాబునాయుడులో ఉత్సహాన్ని నింపనుంది. భవిష్యత్తులోనూ స్వంతంత్ర్యంగా గెలవచ్చన్న ధీవూ ఈ పార్టీ నేతల్లో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో సీట్ల కోసం జరిగే పోరులో మిత్రపక్షాలకు తనదైన రీతిలో సమాధానం చెప్పే అవకాశం నంద్యాల ఎన్నికల వలన టీడీపీకి లభించే అవకాశం ఉంది. టీడీపీ అత్యధిక మెజార్టీ తప్పనిసరి. సర్వేలు, వివిధ వర్గాల ఫలితాలు ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో అధికార జీడీపీ అత్యధిక మోజార్టీతోనే గెలవాల్సి ఉంటుంది. తక్కువ మె జార్టీతో గెలుపొందితే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి పడిన ఓట్లను ప్రభుత్వ వ్యతిరేకతగానే భావించాల్సి ఉంటుంది. ఒక వేళ వైకాపా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే టీడీపీ మూడున్నర ఏళ్ల పాలనను పునఃసమీక్షించుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రత్యర్థి పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని ముందుకు దూసుకువెళ్లే ప్రమాదం లేకపోలేదు. వైకాపా కన్నా అత్యధికంగా ధనంను వెచ్చించటంతోనూ, అధికార దుర్వినియోగం చేసి అధికారులను సైతం ఓటర్లను ప్రలోభపెట్టే విషయంలోనూ టీడీపీ ముందంజలోనే ఉందని పరిశీలకుల భావన. ఈ విషయం ఎన్నికల కమిషన్ అక్కడి డీఎస్సీని ఎన్నికల విధుల నుంచి తప్పించటంలో ప్రజలకు స్పష్టమైంది. ఏది ఏమైనా విజయం మాత్రమే అంతిమంగా కనిపించే విషయం. అధికారంలో ఉన్న టీడీపీకి పరాజయం పాలైనా , తక్కువ ఓట్లతో గెలుపొందినా సాకులు చెప్పకోవటానికి కూడా అవకాశం లేదు. ప్రజల తీర్పును స్వాగతించి తీరాల్సిందే. అందుకే టీడీపీ అత్తరసు మెజార్టీతో గెలుపొందినా పెద్దగా చెప్పకోవటానికి ఏమీ ఉండదనే చెప్పవచ్చు.
                                                           -----     శ్రీ హర్ష 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నంద్యాల.టీడీపీ ఒంటరి పోరుతో భవిష్యత్తులో మారనున్న రాజకీయం ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top