Translate

  • Latest News

    26, ఆగస్టు 2017, శనివారం

    మన కాలపు నడిచొచ్చిన దైవం -మదర్‌ థెరిస్సా


    మన కాలపు నడిచొచ్చిన దైవం
    -మదర్‌ థెరిస్సా 

    మానవ సేవే  మాధవ సేవ అన్నారు పెద్దలు . కానీ సమాజం లో నూటికి 99 శాతం మంది మొదటిది మరచి రొండో దాని తోనే సరిపెడుతున్నారు .
        ఎక్కడో   ఆల్బేనియా లో పుట్టి  18 ఏళ్ల కే సన్యాసం స్వీకరించి మన దేశం లో కలకత్తా కు వచ్చి స్థిర పడి మానవ సేవ లో పునీతమైన మన కాలపు నడిచొచ్చిన దైవం మదర్‌ థెరిస్సా . నేడు ఆమె జయంతి .

    మదర్‌ 1910 ఆగస్టు 26న మాసిడోనియా రాజధాని అయిన 'స్కోప్జె' నగరంలో జన్మించింది. తను పుట్టుకతో ఆల్బేనియా దేశస్థురాలు. ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడం, 18 సంవత్సరాల వయస్సుకల్లా ఇల్లొదిలి 'సన్యాసిని (నన్‌)'గా జీవితాన్ని ప్రారంభించడం మదర్‌ జీవితంలో కీలకఘట్టాలు. 1929లో భారతదేశానికి వచ్చి 'లొరెటో కాన్వెంట్‌'లో ఉపాధ్యాయినిగా పనిచేయడం ప్రారంభించింది. పేదలు, రోగుల కొరకు సొంతంగా సేవా కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. 1948 నుంచి తన కార్యాచరణను ప్రారంభించి 'నిర్మల్‌ హృదరు, శాంతినగర్‌, నిర్మల్‌ శిశుభవన్‌'లాంటి శరణాలయాలను 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' పేరుతో విడతలుగా ఏర్పరిచింది. అనాథలు, రోగులు, మత్తుపదార్థాలకు బానిసలైనవారు, మురికివాడల్లోని పిల్లలు.. ఇలా సమాజ బహిష్కరణకు గురై, తిరస్కరణ భావానకు గురై కుమిలిపోతూ మరణాన్ని ఆహ్వానించే వారందరికీ 'మదర్‌' చేయూతగా నిలిచారు.
    భారతదేశంలోనేగాక నేడు 123 దేశాల్లో దాదాపు 610 కార్యాచరణ కేంద్రాలు 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' కింద పనిచేస్తున్నాయి. మదర్‌ సేవా కార్యక్రమాలకు ప్రతిఫలంగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. వాటిలో ముఖ్యమైనవి 1962లోని 'రామన్‌ మెగసెసే' అవార్డ్‌, 1979లో లభించిన 'నోబుల్‌ శాంతి' బహు మతి, 1980లో ఇవ్వబడిన 'భారతరత్న'. పలు దేశాల పురస్కారాలతోబాటు విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు ఆమెకు లభించాయి. మనుషుల మధ్య సేవావారధి ద్వారా మానవత్వాన్ని పెంచుతూనే మదర్‌ సెప్టెంబర్‌ 5, 1997న మరణించారు.
    తన జీవితం ద్వారా 'సేవ'కు సరైన అర్థాన్ని చెప్పిన 'మదర్‌ థెరిసా' జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం, 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మన కాలపు నడిచొచ్చిన దైవం -మదర్‌ థెరిస్సా Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top