Translate

  • Latest News

    26, ఆగస్టు 2017, శనివారం

    రజనీ నాన్చుడు. ..కమల్ దూకుడు


    రజనీ నాన్చుడు. ..కమల్ దూకుడు
     తమిళనాట రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. పురచ్చితలైవి జయలలిత మరణం తరువాత అన్నా డీఎంకేలో ఏర్పడిన స్థబ్దతను తనకు అనుకూలంగా మార్చుకొని దక్షణ భారత దేశంలో మరో రాష్ట్రాన్ని తన గుప్పట్లో పెట్టుకోవాలని కేంద్రంలో  అధికారంలో ఉన్న బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే శశికళ ను జైలుకు పంపి పన్నీరుసెల్వం, పళనిస్వామిలను ఏకం చేసి తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. ఇది ఇలా ఉండగా తమిళనాట అత్యంత ప్రజాధరణ కలిగిన సినీనటుడు రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశానికి ముందస్తుగా అభిమానుల సమావేశాలు అంటూ హడావిడి చేస్తున్నారు. మరో ప్రముఖ సినీనటుడు కమలహాసన్ ఈ హడావిడి ఏమి లేకుండానే అన్నాడిఎంకే  ప్రభుత్వంపై తన ట్విటర్ ద్వారా అవినీతి ప్రభుత్వంపై సమరశంఖం పూరిసూ డైరెక్ట్ ఎటాక్ ఇచ్చారు.దీనిపై రాష్ట్ర మంత్రులు కూడా తీవ్రంగానే స్పందించారు. కమలహాసన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దమ్మంటే రాజకీయాల్లోకి రావాలని సవాల్ చేశారు. దీనిపై కమల్ ప్రతిస్పందిస్తూ నేను బానిసను కాను నేను నాయకుడ్ని కావాలంటే నన్నెవరు ఆపలేరు. అంటూ మరింత ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ విధంగా కమల్ దూకుడుగా పోతుంటే . అయన సహచరుడు రజనీకాంత్ ఇంకా నాన్పుడు వైఖరిలోనే  ఉన్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రజనీ నాన్చుడు. ..కమల్ దూకుడు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top