పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ హీరో స్టైల్స్ సూపర్బ్ ..అతని డైలాగ్స్ అదుర్స్. లుక్స్ లో మ్యాజిక్. నడకలో డాన్సింగ్ మూవ్ మెంట్స్. టోటల్ గా ఆడియన్స్ ను ఎలక్ట్రిఫై చేసే స్టార్ పవన్ కళ్యాణ్ . అతని పేరు చెప్పగానే యూత్ లో పులకింతలు. సభల్లో పవన్ ను చూడగానే కేరింతలు. ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను మాగ్నిఫై చేస్తున్నాడు కాటమరాయుడు. అభిమానులే ఆయన పార్టీకి సైనికులుగా కాపలా కాస్తున్నారంటే పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. జనసేన పార్టీతో రాజకీయ నాయకుడిగా మారిన పవన్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సమాజంలో ఉన్న సమస్యలని తన వంతు బాధ్యతగా పరిష్కరించుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా వ్యవసాయ విద్యార్థుల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్న పవన్ వెంటనే వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో విద్యార్ధుల ఆనందానికి అవధులు లేవు. అంతేకాదు ఉద్దానం సమస్యని కూడా చాలా సీరియస్‌గా తీసుకొని దాని పరిష్కారం కోసం పలువురితో దఫాలుగా చర్చలు జరుపుతూ వస్తున్నాడు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ ట్విట్టర్ లో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నాడు. 2014 ఆగస్టులో తన ట్విటర్ ఖాతాను ప్రారంభించిన పవన్ చివరిగా ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య ఘటనపై చివరిగా స్పందించారు. అయితే ఈ రోజుతో పవన్ ఫాలోవర్స్ సంఖ్య రెండు మిలియన్స్‌కి చేరింది. ఈ క్రమంలో అభిమానుల ఆనందం తారా స్థాయికి చేరుకుంది. టాలీవుడ్ నుండి కొందరు మాత్రమే ఈ మార్కు చేరుకోగా, ఇందులో పవన్ ఉండడంతో అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.
12, సెప్టెంబర్ 2017, మంగళవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి