చరిత్ర పునరావృతమౌతుందా..? అవుననే చెప్పక తప్పదు. ఎవరైనా . కాని కొన్ని సంఘటనలు చూసూంటే . కొన్ని పోలికలు, ఇంకొన్ని విషయాలు ఇందుకు సాక్షిగా నిలుస్తాయి. ఇదంతా ఎందుకు గాని అసలు విషయానికి వద్దాం.... తగినంత ప్రజాబలం ఉండి, అధికారం చేపట్టే అవకాశం ఉండి కూడా ఆంధ్రరాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ చతికిల పడ్డతీరు. ప్రస్తుత రాజకీయాలకు అన్వయించవచ్చు. నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులు కొంతమేర ఒకేలా ఉన్నాయి. నాడు అవిభక్త కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందా..? కమ్యూనిస్టులను వైఎస్సార్ సీపీ ని ఒకే గాటిన కట్టడమేమిటి నాన్సెన్స్ అంటారా . ఇది ఏలాగో చుద్దాం.
తెలుగురాష్ట్రాల్లో తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. అప్పట్లో మద్రాస్ రాష్ట్రమే రాజధాని. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రపార్టీలు ఒక వైపు, కమ్యునిస్తుపార్టీ మరోవైపు నిలిచారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అప్పట్లో కమ్యూనిస్టు అంటే పేద కూలినాలి జనంలో క్రేజ్. మహానేతల ఉపన్యాసాలకు జనం ఎటువంటి ప్రసార సాధనాలు లేకపోయినా వేలాదిలా తరలి వచ్చేవారు. ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాకినేని భసవ పున్నయ్య ఎన్నికల సభ కాకినాడలో జరిగింది. జనం బాగానే వచ్చారు. కమ్యూనిస్టు నాయకుడు తన దోరణిలో ఆవేశంలో ఏదో మాట్లాడారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కి సపోర్టుగా ఉన్న ఆంద్రపత్రికలో తాటికాయ అంత అక్షరాలతో భూస్వాముల మెడలపై కాడి పెట్టి భూమి దున్నుతామని చెప్పినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే కమ్యునిస్తులు అధికారంలోకి వస్తే భూస్వాముల భూములు లాక్కొని పేదలకు పంచుతారని, సొంత ఆస్తి వ్యవస్థ ఉండదని తదితర ప్రచార కార్యక్రమాలు కాంగ్రెస్ సమర్థవంతంగా అమలు చేసింది. ఇంకే మాకినేని భసవ పు న్నయ్య ఈ మాటలు అనే ఉంటారని భూస్వాములు, పెద్ద బాబులు నమ్మారు. రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎక్కువ మంది ధనవంతులు, భూస్వాములు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎలాగో కమ్యూనిస్టులకు పేదలు,కూలీల మద్దతు ఉంది. ఎక్కడ సభ పెట్టినా వేలాదిగా తరలివస్తున్నారని , అధికారం తమదే అంటూ కలలు కన్నారు. పేదలను ఎలా మేనేజ్ చేయాల్లో అప్పట్లోనే ఆ పార్టీలకు తెలుసు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది. కమ్యూనిస్టు పార్టీకి 39.5 శాతం ఓట్లు లభించాయి. రాజకీయంలో గెలుపే ప్రధానాంశం కాబట్టి ఎలా గెలిచామన్న విషయాలు అప్రస్తుతమే అవుతుంది.
ప్రస్తుతం నేడు రాజకీయాలు నాటి రాజకీయాలను తలపింపచేస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయఢంకా మోగించిన వైసీపీ అనుహ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో డీలా పడింది. ఆ పార్టీ అధినేత జగన్ ఏ సభకు వచ్చినా జనం సమస్యలేదు. లక్షలాదిగా తరలివస్తున్నారు. కాని ఎందుకు ఓట్ల రూపంలో మారటం లేదన్న విషయంపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన నంద్యాల ఎన్నికల్లో జగన్ సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిచంపాలని ఆవేశపూరిత దోరణితో మాట్లాడారు. ఆ పదాలకు వక్రభాష్యం చెబుతూ మిగిలిన పత్రికలు మీడియా కొన్ని రోజులపాటు ఊదరగొట్టాయి. ఈ ప్రభావం నంద్యాల ఉప ఎన్నికలపై పడింది. ఇక్కడే గతాన్ని మనం పోల్చి చూసుకోవాలి. గతంలో కమ్యూనిస్టు నాయకులు మాట్లాడిన మాటాలను కొన్ని వర్గాల్లో తీసుకువెళ్లి, తమకు అనుకూలంగా ఓట్ల రూపంలో మార్చుకోవటంతో నాటి కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైతే, నేడు జగన్ మాటలను నెగిటివ్గా ప్రచారం చేసి లబ్దిపొందటంలో టీడీపీ విజయం సాధించింది. నాటి కమ్యూనిస్టు పార్టీకి, నేటి వైఎస్సార్సీపీ కి ప్రజాబలం ఉందన్న విషయం కాదనలేని నిజం. కాని ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్లో ఈ రెండు పార్టీల వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. తమ పార్టీ సిద్దాంతాలు నచ్చి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని నాటి కమ్యూనిస్టు పార్టీ భావిస్తే , తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లు వేసి అందెలం ఎక్కిస్తాయని జగన్ భావించాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వైఎస్సార్ సీపీ మరో వామపక్ష పార్టీగా మారే అవకాశం కొట్టి పడవేయ లేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి