వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని వైకాపా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది.తన సొంత మీడియాలో ప్రచారం మాట అటుంచితే , సోషల్ మీడియా , అన్ లైన్ వెబ్ సైట్ లు , అధికార పార్టీకి కొమ్మకాస్తున్న వివిధ న్యూస్ పోర్టర్ లలో సైతం వైఎస్సార్ కుటుంబం సంబంధించిన యాడ్స్ తో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైకాపా అధినేత జగన్ పాదయాత్రకు ముందు ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కింది స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం నుంచి అదేశాలు అందినట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి ముందు రాష్ట్రంలో ని అన్ని నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నాయకులను సమన్వయం చేయటానికి వారికి అవగాహన కల్పించటానికి రాష్ట్రస్థాయి నాయకులు తరలివచ్చినా మీడియాను మాత్రం అనుమతించకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. గడపగడప కు వైస్సార్ కార్యక్రమానికి భిన్నంగా హంగు ఆర్పాటం లేకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అధినేత పేర్కొన్న నవరత్నాలను ప్రచారం చేయటం , చంద్రబాబుపాలనపై ప్రజాబ్యాలెట్ ద్వారా అభిప్రాయాలను సేకరించటం, అత్యధిక మందిని పార్టీలో చేర్చటం వైఎస్సార్ కుటుంబం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా పార్టీని ప్రజలందరి వద్దకు చేర్చటానికి టీడీపీ కన్నా వైకాపా మరో ముందడుగు వేసింది.సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించి టీడీపీ సభ్యత్వాలు చేర్చగా, వైకాపా ఈ సారి మిస్సెడ్ కాల్ తో ,వెబ్ సైట్ తో పార్టీలో చేరటానికి అవకాశం కల్పించింది. ఈ వ్యూహం అంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దే అని చెబుతున్నారు . చూద్దాం ఈ కార్యక్రమం ఏ విధంగా వైకాపాకు ప్లస్ అవుతుందో.
16, సెప్టెంబర్ 2017, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి