Translate

  • Latest News

    14, సెప్టెంబర్ 2017, గురువారం

    మయన్మార్ రోహింగ్యాశరణార్డుల విషయంలో.... ప్రధాని మోడీ మౌనం వెనుక మర్మమేమిటి




    శరణార్డుల విషయంలో ప్రధాని అనుసరిస్తున్న వ్యూహంమేమిటి. అసలు ప్రధాని మోడీ మౌనం వెనుక కారణాలులేమిటన్న విషయాలు అందరిలో సందేహాలు రేకిత్తిస్తున్నాయి. ఇప్పడు మయన్మార్లో రోహింగ్యా ముస్లింల ఊచకోత తదితర అంశాల జోలికి మనం ఇప్పడు వెళ్లటం లేదు.
    ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ముద్దుబిడ్డ అర్ఎస్ఎస్ మొదటి నుంచి భారతతీయ సంస్కృతి , సంప్రాదాయలకు పెద్దపీట వేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగానే జనవరి ఒకటి తేదీ నూతన సంవత్సర వేడుకులు, పిబ్రవరి 14 వాలెంటర్స్డే ఉత్సవాలను వ్యతిరేకిస్తారు. భారతతీయ సంస్కృతి , సంప్రదాయాన్ని గౌరవించే ప్రధాని మోడీ శరణుగోరివచ్చినవారి పట్ల ఎందుకు దాటివేత దోరణి అనుసరిసున్నారు అనే విషయంలో స్పష్టత లేదు. 
    శరణుగోరి వచ్చిన గయుడ్ని అభయమివ్వటం వల్లనే కదా నాడు కృషార్జున యుద్ధం జారింది
    తనను శరణుగోరిన గయుడుకి అర్జునుడికి అభయమిచ్చి బావ శ్రీకృష్ణుడుతో యుద్ధం అనివార్యమైనా , ఇచ్చిన మాటకు కట్టబడిన తీరు పురాణాల్లో ఉంది. అటువంటి సంసృతిని పరిరక్షిస్తామంటున్న ప్రధాని మయన్మార్ రోహింగ్యా ముస్లిం శరణార్డుల విషయంలో ఎందుకు వ్యతిరేక దోరణి అనుసరిస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో తప్ప శరణార్డులకు ఆశ్రమం కల్పించలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది. . అన్న ప్రశ్నలు కీలకంగా వూరాయి. ఊచకోతలు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన వెూడీ మయన్మార్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులపై ఒక్కమాట వూట్లాడలేదు. ఆ దేశం అంతర్యుద్దంలో వల్లకాటిగా మారిన అనంతరం దేశ పునర్మిణానికి సహకరిస్తామని మాత్రమే హామి ఇచ్చారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్డులకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆశ్రమం కల్పించిన విషయం గుర్తుచేస్తున్నారు. ఇక్కడ మోడీ మౌనం వెనుక మరో వాదన వినిపిస్తుంది.ఇప్పటికే ముస్లింలపై సంఘ పరివార్ లాంటి సంస్థల ప్రచారం తీవ్రమైంది శరణార్డులుగా భారతదేశానికి వచ్చిన వారు ముస్లింలు కాబట్టి , . వీరు కూడా భారతదేశంలో అడుగుపెడితే దేశంలో ముస్లింల ప్రాపకాండ పెరిగిపోయే ప్రమాదం ఉందని వెనుక మోడీ వెనుక టీమ్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది. శరణారుల విషయంలో దాటివేత దోరణిలో కాకుండా, ప్రధాని మోడీ శరణార్డులకు ఆశ్రమం కల్పించే విషయంలో స్పష్టమైన వైఖరీ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మయన్మార్ రోహింగ్యాశరణార్డుల విషయంలో.... ప్రధాని మోడీ మౌనం వెనుక మర్మమేమిటి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top