Translate

  • Latest News

    17, సెప్టెంబర్ 2017, ఆదివారం

    రాజకీయ పార్టీలకు కోవర్టుల బెడద... రహస్యాలు ప్రత్యర్థి పార్టీకి అందుతున్నట్లు బెంబేలు




    శత్రుశిబిరంలో చొరబడి శత్రువుల రహాస్యాలను వెల్లడించే నిఘా వ్యవస్థ అతి ప్రాచీనమైంది. ఇందుకు సంబంధించి పురాణగాధలు కూడా ఎన్నో ఉన్నాయి. తన కుటుంబాన్ని మట్టు బెట్టిన కౌరవులను అంతమొందించానికి శకుని ఏ విధంగా శత్రుశేషానికి ఒడిగట్టాడో అందరికి తెలిసిన కథే.
    రాజకీయాల్లో ఇటువంటి ఎత్తుగడలు గతం నుంచి ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేసి ప్రత్యర్థి పార్టీలో చేర్చి వారి ఆ పార్టీ తాలుకు రహస్యాలు, బలహీనతలు తెలుసుకొవటం జరుగుతున్న తంతే. ఇదంతా గతంలో ఎన్నికలకు ముందు జరిగేవి.ఆయా పార్టీలో చేరి ఎప్పటికప్పుడు నాయకుడు ఎం చేస్తున్నాడు. పార్టీలోని బలహీనతలు ఏమిటి..? ఎన్నికల సమయంలో ఎవరిని కలుస్తున్నారు. .అనే సమాచారం అందేవి. దీనిని ఇంప్లిమెంట్ చేయటంలో టీడీపీ ముందంజలో నిలిచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా నాయకులు కొంతమంది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కలిసి వచ్చి బేరసారాలు మాట్లాడుతున్న క్రమంలో రెండో రోజు ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించి , తన పని కానిచ్చింది. వైకాపాలో ఉన్న కోవరులు సమాచారాన్ని టీడీపీకి అందజేసేవారు. ఇదంతా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓడిన తరువాత విశ్లేషించుకుంటే బయటపడ్డనిజాలు ఇవే 
     కాని ప్రస్తుతం బ్రెండ్ మారింది. ఎన్నికలు అయిపోగానే అధికార పార్టీలో అనేకమంది ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు చేరిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది. అధికారంలో ఉన్న పార్టీ వైపు చేరటం , వారి పనులు చక్కబెట్టుకోవటం సహజమే. ఏపీలో అధికారపార్టీ నుంచి ముఖ్యమైన సమాచారం ప్రత్యర్థిపార్టీ వైకాపాకు చేరుతున్నట్లు సమాచారం. గతంలో వైకాపా ప్లేనరి సమావేశం ఏర్పాటు చేసి నవరత్నాలు ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇందులో అనేక పథకాలు తమ పార్టీ నుంచి బయటకు లీకైనట్లు స్వయాన అధికార పార్టీ పత్రిక అంద్రజ్యోతి స్పష్టం చేసింది. ఫించన్ ను పెంపుదల అంశంపై ముఖ్యమంత్రి కొంతమంది ముఖ్యలతో చర్చించారని ఆ విషయం వైకాపా కు ఎలా చేరిందని వాపోయనట్ల ఆ పత్రిక వ్రాసింది. వెంటనే మేల్కొన్న టీడీపీ వర్గీయులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వైకాపా సభ్యత్వనమోదు కార్యక్రమం వైఎస్సార్ కుటుంబం కొనసాగుతుంది. దీనిని అవకాశంగా చేసుకొని కొంతమందిని ఎంపిక చేసి అన్ని నియోజకవర్గాల్లో వైకాపాలో చేర్చటానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అధికార పార్టీ నాయకులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వైకాపా కూడా పార్టీలో ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించింది. పార్టీలో ఉన్న కోవర్టులను  గుర్తించివారిని ఏరివేయటానికి రంగం సిద్ధం చేసింది. ముఖ్యమైన సమాచారం బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుంటన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీని పక్కన పెడితే అధికార పార్టీకి శిక్షణ పొందిన అధికారులు సహకరించే వీలున్నా ప్రత్యర్థి పార్టీలో చొరబడి రహస్యాలు బయటకు చెప్పే నాయకులపై గురి ఎక్కువ. మొత్తం మీద ఈ రెండు పార్టీల్లో ఉన్న కోవర్టులతో  ఎప్పడు ఏ సమాచారం బయటకు పొక్కుతుందా అని అందోళనలో ఉన్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాజకీయ పార్టీలకు కోవర్టుల బెడద... రహస్యాలు ప్రత్యర్థి పార్టీకి అందుతున్నట్లు బెంబేలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top