1, సెప్టెంబర్ 2017, శుక్రవారం
ప్రతి ఎన్నిక ఒక సమరమే..... ఆ యుద్దాన్ని ఎదుర్కొనే సమర్థులే ఎన్నికల బరిలో బాద్యతలను భూజాన్న వేసుకుంటారు. అటువంటి సమర్థులనే ఎంపిక చేసి భాద్యతలు అప్పగిస్తారు. ఇక్కడ అదే జరిగింది. ఒకవైపు నంద్యాల ఉప ఎన్నిక, మరోవైపు కాకినాడ నగర్ పాలక సంస్థ ఎన్నిక, ఈ రెండింటి లోను అధికార పార్టీగా ఉన్న టీడీపీ తప్పని సరిగా గెలవాల్సిన పరిస్థితి. ఇక్కడ నంద్యాల పరిస్థితి వేరు. కాని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కన్నా ఇతర అంశాలే ప్రభావితం చేస్తాయి. కుల,మత సామాజిక వర్గాలతో పాటు స్థానికంగా ఉండే వివిధ అంశాలపైనే ఓటర్లు తీర్పు చెబుతారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల బాధ్యతను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించింది మొదలు ప్రత్తిపాటి పుల్లారావు రోజలు తరబడి అక్కడే మకాం వేశారు. రాజకీయ సమీకరణలు, పార్టీల బలాబలాలు, స్థానిక పార్టీ క్యాడర్ తదితర అంశాలను క్షణ్ణంగా అధ్యయనం చేశారు. నగరంలో అన్ని వారుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోల్ మేనేజ్ మెంట్ పై ఉన్న అవగాహన,పలు ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవంతో కాకినాడ నగర పాలక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించటానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కృషి చేశారు. తనపై విశ్వాసం ఉంచిన సీఎం చంద్రబాబుకు ఈ విజయాన్ని మంత్రి ప్రత్తిపాటి కానుక గా అందించారు.
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి