విజయం ఒక విస్ఫోటనంగా వస్తోంది. కాని ఓటమి ఉరుములు, మెరుపులులేని వానలా తడిసిముద్దచేస్తోంది. కాని గెలుపు కన్నా ఓటమి ఉంచే అనేక పారాలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నవారే నేడు అధికారం అనుభవిస్తున్నారు. ఓటమిని హుందాగా ఆహ్వానించి , తప్పొప్పలు పునఃసమీక్ష చేసుకొని ముందుకు సాగితే విజయం వెన్నంటి ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నిక ఓటమి నుంచి తెరుకొక ముందే కాకినాడ ఎన్నికల ఫలితాలు విడదలయ్యాయి. ఫలితాలు అందరు ఊహించినట్లే టీడీపీకి అనుకూలంగా నే వచ్చాయి
గతం ఎప్పడు నాస్తి కాదు .అది అనుభవాల ఆస్తి. అన్న పెద్దల మాటను వైకాపా స్పూర్తిగా తీసుకుంటుండా. ఓటమి నుంచి పారాలు నేర్చుకుంటుందా. ఏ విధంగా ముందుకు పోతుందన్న అన్న అంశాలపై ఆ పార్టీ అభిమానులు వేచి చూస్తున్నారు. ఇప్పటికికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంతి కిషోర్ టీమ్ పలువూర్లు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలల్లో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులను అధినేతకు అందించినట్లు సమాచారం. నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలన్న కామన్ లాజిక్ తో పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. కిందిస్థాయి క్యాడర్ నుంచి ప్రక్షళన కార్యక్రమం మొదలైంది. జగన్ ప్లినరీ లో ప్రకటించిన నవరత్నాలను విస్తృత స్థాయిలో ఇప్పటినుంచే ప్రజల్లో తీసుకువెత్తే ఎన్నికల నాటికి తమ పని సులువొంతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ వనరత్నల పై సభలు ఏర్పాటు చేశారు. పాదయాత్రకు ముందే కార్యకర్తలకు శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. నంద్యాల ఉప ఎన్నికల, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలతో క్యాడర్లో నిస్తేజం అలుముకోకుండా సోషల్ మీడియా, జగన్ సొంత మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. గత ఉప ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన విధానాన్ని ఉటంకిసూ ఉప ఎన్నికల్లో గెలుస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అపజయం పాలౌతారన్న సెంటిమెంటును కార్యకర్తల్లో ఇంజక్ట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలపైనే ప్రశాంతికిషోర్ టీమ్ మాత్రం బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదంతా ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూద్దాం.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి