Translate

  • Latest News

    15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

    వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ఇంటి చిట్కాలు, ఆహారంలో మార్పులు


    గర్భధారణ జరిగిన రెండోనెల నుండి వేవిళ్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా ఉండటంతో ఆహారం తీసుకోలేక పోతుంటారు. పైగా తిన్నది కాస్తా వాంతుల రూపంలో వెళ్లిపోతోంది.  అసలు ఈ వేవిళ్లు ఎప్పుడు మొదలవుతాయి, ఎంత కాలం ఉంటాయి. వీటివల్ల ప్రమాదం ఏమాయిన ఉందా అనే విషయాలు తెలుసుకుందాం....
    గర్భధారణ జరిగాక వేవిళ్ల వల్ల వికారం, వాంతులు చాలా సాధారణం. ఇవి 10వ వారం ప్రెగ్నెన్సీ సమయంలో అంటే దాదాపు రెండున్నర నెలల సమయంలో ఎక్కువగా ఉంటాయి.. సాధారణంగా ఇలా వికారం, వాంతులు అన్నవి ఉదయం వేళల్లోనే ఎక్కువ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది సాయంత్రాలతో సహా ఏ వేళల్లోనైనా ఉండవచ్చు. ఇలా వేవిళ్ల వాంతులు కావడం అన్నది ఎన్నిసార్లు జరిగితే అది సమస్యగా పరిగణించడానికి నిర్దిష్టంగా ఒక లెక్కంటూ లేదు. చాలా సుకుమారంగా ఉండేవాళ్లలో కేవలం రెండు మూడుసార్లకేనీరసపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఐదారు సార్లు వాంతులైనా తట్టుకోగలరు. ఇక దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉందా అంటే... అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండి, రక్తహీనత లేకుండా, తగినంత హిమోగ్లోబిన్ ఉన్న  వాళ్లయితే వాంతులు అవుతున్న కారణంగా గర్భధారణ సమయాల్లో పెరగాల్సినంతగా బరువు పెరగకపోయినా... దీనిని పెద్ద ఇబ్బంది గానూ, సమస్యగానూ పరిగణించాల్సి అవసరం లేదు.
    ఐదో నెల వరకూ ఇలా ఉండవచ్చు. అప్పటి వరకూ బరువు పెరగకపోయినా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఐదునెలల తర్వాత కూడా గర్భిణీ తగినంతగా బరువు పెరగకపోతే మాత్రం అప్పుడు డాక్టర్ను సంప్రదించాలి.
    వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ప్రధానంగా ఇంటి చిట్కాలు, ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. ఇంటి చిట్కా విషయానికి వస్తే అల్లం మురబ్బా తీసుకోవడం గాని లేదా అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిసిన మిశ్రమాన్ని తీసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇదేమీ వేవిళ్లకు ఔషధం కాదు. అయితే వేవిళ్లతో బాధపడేవారికి చాలావరకు ఉపశమనంగా ఉంటుంది.

    ఇక ఆహార మార్పుల విషయానికి వస్తే... చాలామంది మహిళలకు ఈ సమయంలో వారి ఆహారపు అలవాట్లు మారినట్లుగా ఉంటాయి. అంటే... అంతకు మునుపు స్వీట్స్ ఇష్టపడని వారికి ఈ సమయంలో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. అలాగే అంతకు మునుపు కారాలు, మసాలాలు అస్సలు ముట్టని వారికి, ఈ సమయంలో వాటిని ఎక్కువగా తీసుకోవాలని అనిపించవచ్చు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ఇంటి చిట్కాలు, ఆహారంలో మార్పులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top