Translate

  • Latest News

    23, అక్టోబర్ 2017, సోమవారం

    హ్యాపీ బర్త్ డే డార్లింగ్...



    ఇదేమిటి... ఇలా అంటున్నారు.... అనుకుంటున్నారా... అందరికీ ఒకరే డార్లింగ్ ఉండొచ్చు. కానీ అందరికి కామన్ డార్లింగ్ మాత్రం ఒకరే. అందరిని డార్లింగ్ అని పిలుస్తూ అందరితో డార్లింగ్ అని పిలిపించుకునే ఒకే ఒక వ్యక్తి ప్రభాస్. అదేనండి.. మన అమరేంద్ర బాహుబలి... అతడి పుట్టిన రోజు ఈ రోజే... అక్టోబర్ 23. ఉప్పలపాటి వెంకట సత్యన్నారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ 1979 అక్టోబర్ 23 న పుట్టాడు. తండ్రి సూర్యనారాయణ రాజు, తల్లి శివకుమారి. 2002 ముందు వరకు ప్రభాస్ కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. 2002 లో ప్రభాస్ హీరోగా మొదటి సినిమా ఈశ్వర్  వచ్చింది. 2004 వచ్చిన వర్షంలో ప్రేక్షక జనం తడిసి ముద్దయ్యాకే ప్రభాస్ తెలుగు వారి ముద్దుల కొడుకయ్యాడు. 2005 లో ఛత్రపతి తో తెలుగు సినీ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అదే ఏడాది వచ్చిన చక్రం తెలుగు వారి మనసులు దోచుకున్న సమ్మోహన చక్రం అయింది. 2009 లో బిల్లా తో  యూత్ ఫిదా... ఇక 2010 లో డార్లింగ్ సినిమా డార్లింగ్ గురించి చెప్పేదేముంది. 2011 లో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. 2013 లో మిర్చి తో మాస్ కు మంటెక్కించాడు. ఆ తర్వాత కధ నేను మీకు ప్రత్యేకంగా చెప్పేదేముంది... 2015 లో బాహుబలి-1, 2017 లో బాహుబలి-2 ఇండియన్ సినిమా చరిత్రనే తిరగరాశాయి. 2018 లో సాహో తో మళ్ళీ మనందరినీ అయన ముందు సాగిలపడేలా చేస్తాడేమో చూద్దాం. ఇంతకూ 38 నిండి 39 వ ఏట అడుగుపెడుతున్న ఈ స్టిల్ బ్యాచిలర్ 15 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటివరకు మొత్తం 19 సినిమాలు చేసాడు. అందులో ఒకటి హిందీ సినిమా ఏక్షన్ జాక్సన్. అందులో గెస్ట్ రోల్ మాత్రమే. తెలుగులో 18 సినిమాలు చేసాడు. 20 వ సినిమా సాహో కూడా 150 కోట్ల బడ్జెట్ సినిమా సుమండీ. సో.. ఒన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే టు డార్లింగ్... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హ్యాపీ బర్త్ డే డార్లింగ్... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top