Translate

  • Latest News

    24, అక్టోబర్ 2017, మంగళవారం

    కోర్టుతీర్పుతో జగన్ శిబిరంలో నిరాశ.... రెండడుగులు ముందుకు... మూడడుగులు వెనుక్కులా మారిన పాదయాత్ర

    ముందునుయ్యి. వెనుక గొయ్యి అన్న రీతిలో మారింది రాష్ట్ర ప్రతిపక్షపార్టీ వైకాపా స్థితి. నవంబర్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. కాని కోర్టు  తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని చేసుకొన్న అభ్యర్ధనను తోసిపుచ్చింది. అంటే ప్రతి శుక్రవారం ఎక్కడ ఉ న్నా పాదయాత్రలో ఉన్న జగన్ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావల్సిందే. మరోవైపు జగన్ పాదయాత్ర ఉన్న సమయంలోనే అధికార టీడీపీ వ్యూహాత్మకంగా నవంబర్ 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది.
     ఒకవైపు పాదయాత్ర జరిగే సమయంలోనే శుక్రవారం కోరుకు హాజరుకావల్సి రావటం, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఎటు పాలుపోని పరిస్థితుల్లో వైకాపా శిబిరం డీలా పడింది. వైకాపా మానసపుత్రిక సాక్షిలో సైతం వైకాపా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిద్దామన్న అలోచనలో ఉన్నట్లు సమాచారం అని మాత్రమే పేర్కొవటం విశేషం. అంటే ఇంకా ఈ విషయంపై కూడా క్యారిటి లేదు. మరోసారి పాదయాత్ర డేట్ కూడా మారిపోయింది. నవంబర్ 2 నుంచి కాకుండా అరోతేదీ నుంచి పాదయాత్ర కొనసాగుతుంది అని  ప్రకటించింది.

     వాస్తవంగా జగన్ పాదయాత్ర తేదీ ప్రకటించిన నాటి నుంచి కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభిస్తుందని పార్టీ అధినేత జగన్ తో పాటు శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అవునన్నా కాదన్నా సర్వవ్యవస్థలు కేంద్రం చెప్పచేతుల్లోనే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అనుకులంగా ఉండే వారిపై ఎటువంటి కేసులైనా మాఫీ అయ్యేవి. ఎదురుతిరిగిన వారిపై చిన్న కాగితం ముక్కపై రాసిన ఫిర్యాదు యైనా దాన్నే బ్రహ్మాస్థంగా వినియోగించి అంతు చూసేదాక నిద్రపోయేది కాదు. జగన్ పై ప్రస్తుతం నడుస్తున్న కేసులు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేసినందుకు ఇచ్చిన బహుమానమే అని మరచిపోరాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కన్నారెండాకులు ఎక్కువే చదివినట్లు పలు సంఘటనలు రుజవు చేస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జగన్ కేంద్రంలో ఉన్న బీజేపీతో అంతర్గతంగా మంచి స్నేహ సంబంధాలనే మెయిన్టెన్స్ చే శారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరుతుగా అందరికన్నాముందుగానే మద్దతు కూడా ప్రకటించారు. కాని ఏమైందో ఏమో ముందే చెప్పకున్నట్లు (లింక్ http://www.bhinnaswaram.com/2017/10/blog-post_9.html)

     అయిపోయిన పెళ్లికి భాజాలు అన్న విధంగా తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై భిన్న స్వరం వినిపించారు.దీంతో సీబీఐ కూడా వేగం పెంచింది. స్వరంలో మార్పు వచ్చింది. జగన్కు  ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టుకు హాజరు విషయంలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వరాదని వాదించింది. దీంతో వైకాపా శ్రేణుల అశలపై నీళ్ల చల్లుతూ కోర్టు   జగన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. తాజా పరిణామాల పట్ల వైకాపాలో నిరాశ నిస్ప్రు హలు అలుముకున్నాయి. 

    శ్రీహర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కోర్టుతీర్పుతో జగన్ శిబిరంలో నిరాశ.... రెండడుగులు ముందుకు... మూడడుగులు వెనుక్కులా మారిన పాదయాత్ర Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top