Translate

  • Latest News

    29, అక్టోబర్ 2017, ఆదివారం

    రాజకీయ పునరేకీకరణా.. లేక రెడ్ల పునరేకీకరణా ...

    రాజకీయ పునరేకీకరణ... ఈ మాట శనివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి వాడిన మాట. ఇంతకూ తెలంగాణలో జరుగుతున్నది రాజకీయ పునరేకీకరణా.. లేక రెడ్ల పునరేకీకరణా ... అనే అనుమానం కూడా తలెత్తుతోంది. నిజమే... కె.సి.ఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో రాజకీయ శక్తుల ఏకీకరణ జరుగుతోంది. బలమైన . కె.సి.ఆర్ ను ఎదుర్కోవడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు వామపక్షాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. మరో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 360 డిగ్రీస్ తో ప్లేట్ ఫిరాయించి ఏకంగా అధికార పక్షముతోనే కలవాలని ఆలోచన చేయడం ఆ పార్టీకి ఆత్మహత్య సదృశమైనది. దీనికి తోడు ఇప్పడు తెలంగాణలో బలంగా వినిపిస్తున్న మరో వైరల్ వెల్కమ్ గ్రూప్... వెల్కమ్ గ్రూప్...అంటే... వెలమలు, కమ్మలు కలిసిపోయి ఒక గ్రూపుగా ఏర్పడి తెలంగాణలో రాజ్యాధికారాన్ని పంచుకోవడం. ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడ కలియుగ చాణిక్యుడు చంద్రబాబు బుర్రలో పుట్టిందే. ఈ ఆలోచన ప్రభావం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి బాబు ముందుగా లీక్ వదిలాడు. ఆ లీక్ పర్యవసానమే రేవంత్ రెడ్డి ప్రతి చర్య. అయితే చంద్రబాబుకు తన సామాజిక వర్గ ప్రయోజనాల ముందు రేవంత్ రెడ్డి కానీ.. మారె రెడ్డి కానీ ఎవరు ముఖ్యం కాదు. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గ ఆస్తులను కాపాడుకోవాలన్నా... తానూ ఓటుకు నోటు కేసులో నుంచి సురక్షితంగా బయటపడాలన్నా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన అస్థిత్వాన్ని నిలుపుకోవాలన్న అన్నిటికీ ఇదొక్కటే నారాయణ మంత్రం అని చంద్రబాబు డిసైడ్ అయ్యాడు. అందుకే ఓటుకు నోటు కేసులో తన సహచర నిందితుడు రేవంత్ రెడ్డి ని సైతం ఈజీ గా వదిలేసుకున్నాడు. ఆఫ్కోర్స్ బాబు ఆగమన్నా ఆగే స్థితిలో రేవంత్ లేదనుకోండి. వెల్కమ్ కుట్ర తెలిసాక ఇన్నాళ్లు తానూ పోరాడిన కె.సి.ఆర్ తో కలవడానికి మనసొప్పక సహజంగా పోరాటయోధుడైన రేవంత్ ఎదురుతిరిగాడు. తన ఇండివిడ్యువాలిటీ నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ తో కలవాలని డిసైడ్ అయ్యాడు. రేవంత్ గ్రాండ్ ఎంట్రీకి ఆయనకు వరుసకు మామ అయిన జైపాల్ రెడ్డి అధిష్టానంలో తనకున్న పలుకుబడితో ఏకంగా రాహుల్ తో రెడ్ కార్పెట్ పరిపించి మార్గం సునాయాసం చేసాడు. ఇక అధికారికంగా కాంగ్రెస్ లో కాలు మోపడమే తరువాయి. అది ఇందిరా గాంధీ వర్ధంతి ఆయన ఆక్టోబర్ 31 నా... లేక నవంబర్ 9 నా అనేది తేలాల్సి ఉంది. అంతే. 
      -మానవేంద్ర
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాజకీయ పునరేకీకరణా.. లేక రెడ్ల పునరేకీకరణా ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top