Translate

  • Latest News

    30, అక్టోబర్ 2017, సోమవారం

    మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా...

    నడిచిన దారులు...జెండాలు పాతిన భూములు... కూలిపోయిన గడీలు... పారిపోయిన పెత్తనం... అధికార దాహంతో ప్రాణం పోసుకున్నాయి... మీరు మళ్ళీ రండి... మీరందించిన జెండా... పోరాడిన స్ఫూర్తి... మీ త్యాగం... మాకు గుర్తుకొస్తున్నాయి... మా బతుకుల్లో వెలుగులు నింపేందుకు... మీరు మళ్ళీ రండి... మీ నేతృత్వం మాకు కావాలి... మీతోపాటు కలసి నడుస్తాం... మీరు మళ్ళీ రండి...                                                                                                                                      

                  ఈ వాక్యాలు ఈ నెల విరసం సాహిత్య,సాంస్కతిక మాస పత్రిక అరుణతార ముఖచిత్రంపై లిఖించినవి. ఈ వాక్యాలు ప్రస్తుత సమాజానికి అద్దం పడుతున్నాయ్. ప్రశ్నించే స్వరాల పీక నులుముతూ ప్రశ్నల్ని బయటకు రాకుండానే సమాధి చేస్తున్న పాలకుల నియంతృత్వాన్ని ప్రతిఘటించడానికి ప్రజాస్వామ్య శక్తుల బలం చాలడం లేదు. ఎం.ఎల్.ఏ లు  తహసీల్దార్ లను కొట్టినా దిక్కులేదు. ఎం.పి లు ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారులను బహిరంగంగా తిట్టినా దిక్కులేదు. యూనివర్సిటీ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమై నెలలు గడిచినా కనీసం సమాధానం చెప్పే నాధుడు ఉండడు. 90 శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసరును రెండేళ్లయినా కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్ లోనే చావనీ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నా అడిగే నాధుడు లేదు. నిజంగా అసలు మనం ప్రజాస్వామ్య  పాలనలోనే ఉన్నామా... లేదా  మిలిటరీ రూల్ లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో రాజ్యానికి వ్యతిరేకంగా కనీసం ప్రశ్నించడాన్ని కూడా పాలక పార్టీ అనుబంధ శక్తులు సహించలేకపోతున్నాయి. ఆయా వర్గాలపై దాడులు చేస్తున్నాయి. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి సినీ నటులు ప్రశ్నించినా సహించలేక పోతోంది. మెర్సల్ లాంటి సినిమాల్లో జి.ఎస్. టి ని  విమర్శించినా   సహించచలేకపోతున్నారు. ఇలాంటి  తరుణంలో దోపిడీ, దౌర్జన్యాలను  నిలదీసేందుకు ప్రజలు ఒక బలమైన శక్తిని కోరుకోవడం  సహజమే  ... అది గతంలో  తమకు అండగా ఉండి, తమకు కొత్త బతుకుల్ని ఇచ్చిన వారిని మళ్లి రమ్మని పిలుస్తున్నారనేది ఆ ముఖచిత్ర వాక్యాల సారాంశం. ప్రజలు అలా నిజంగా కోరుకున్నా..కోరుకోకపోయినా...    ప్రస్తుతం సమాజంలో మాత్రం అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఒకవేళ ప్రజలు సంఘటితమై తిరగబడితే తప్పు మాత్రం ప్రజలది కాదు. అటువంటి పరిస్థితులను కల్పించిన రాజ్యానిదే తప్పు.                                    

                                                                                                                                                                                                                                       -మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top