Translate

  • Latest News

    31, అక్టోబర్ 2017, మంగళవారం

    నా ముందే నా ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం ....రోహింగ్యా ముస్లిం మహిళ


    బుద్ధం, శరణం, గచ్చామి అంటూ శాంతి వచనాలు వల్లించిన చోట మియన్మార్‌ లో రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్‌ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ , ఊచకోత దవణంలా కోనసాగుతూనేఉంది. ఆర్మీ పోస్టులపై రోహింగ్యా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారన్న నేపంతో ఆర్మీ నరమేధానికి పాల్పడుతోంది. మయన్మార్‌లో అత్యధికులు బౌద్ధ మతస్థులు. ఆ దేశంలో నివసించే రోహింగ్యా ముస్లింల సంఖ్య చాలా తక్కువ(మైనారిటీ). దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు రఖైన్‌ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. స్వయంగా సైన్యం, రోహింగ్యా ముస్లింల విూద దాడులకు తెగబడుతోంది. రఖైన్‌ రాష్ట్రంలో వందల కొద్దీ గ్రామాలు తగులబడిపోయాయి. సైనికులు రోహింగ్యా ముస్లింలు దాగి ఉన్నారనే ఆరోపణలతో గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. వందలాది గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. దీంతో వణికిపోతున్న సామాన్య రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు

    బంగ్లాదేశ్ దేశంలో సాయుధ సైనికులు రోహింగ్యా ముస్లిమ్ లపై జరిపిన దారుణాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఇల్లు, ఇద్దరు కూతుళ్లతో సహా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో శరణార్థుల శిబిరానికి వచ్చిన ఓ మహిళ బంగ్లా సైనికులు సాగించిన మారణ, దారుణ కాండ గురించి ఏకరవు పెట్టింది.‘‘ సైనికుల ఆగడాలనకు నేను ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లను కోల్పోయాను. అర్దరాత్రి వేళ సైనికులు వచ్చి మా ఇంటిని దహనం చేశారు. సైనికులు నా ముందే నా ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసి వారిని హతమార్చారు. నా కుమారులను కూడా వారు కాల్చి చంపారు. నా కళ్లముందే నా కూతుళ్లపై అత్యాచారం చేస్తున్నా, హతమారుస్తున్నా ఏమీ చేయలేక పోయాను. కనీసం వారి మృతదేహాలు కూడా అప్పగించలేదు.’’ అని ఓ బాధిత మహిళ ఆవేదనగా చెప్పారు. రోహింగ్యాల దీన గాథలను మానవహక్కుల సంస్థ తాజాగా విడుదల చేసింది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నా ముందే నా ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం ....రోహింగ్యా ముస్లిం మహిళ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top