Translate

  • Latest News

    31, అక్టోబర్ 2017, మంగళవారం

    జీవితాల్లో చిచ్చు రేపుతున్న పోర్న్‌ సైట్స్‌


    ఇప్ప‌టికే పోర్న్ సైట్ల తాకిడి బీభ‌త్సంగా ఉంది. పోర్న్ సైట్లు కొన్ని జీవితాల్లో చిచ్చు రేపాయి. .. పోర్న్ సైట్లు, వీడియోల వ‌ల్ల త‌న కుటుంబం ఛిన్నాభిన్న‌మైంద‌ని అంటూ ఇటీవ‌లే ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన భర్త పోర్న్ వీడియోలు చూస్తున్నాడని, దీనివల్ల తమ కాపురంలో కలతలు ఏర్పడ్డాయని, పోర్న్ సైట్లను నిషేధించాలని బాధిత మహిళ సుప్రీంను వేడుకుంది. గతంలో పోర్న్ సైట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఫోర్న్ సైట్స్ నిషేదం అంటే.. ప్రజల వ్యక్తిగా స్వేచ్ఛను హరించడమే అని వ్యాఖ్యానించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఫోర్న్ సైట్స్ నిషేదించలేదని... కేవలం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్లాక్ మాత్రమే చేయించామని అంది.
    క్రైమ్‌ రేట్‌ పెరగడానికి పోర్న్‌ సైట్స్‌ ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 3 కోట్ల పోర్న్‌ సైట్స్‌ ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్నాయని, అమ్మాయిల మీద దాడులకు పోర్న్‌ సైట్స్‌ కూడా కారణమని వారు గుర్తించారు. ఈ పోర్న్‌ సైట్‌లు 17 ఏళ్ల యువకులపై పెను ప్రభావం చూపుతున్నాయని, యువత తమ మొబైల్‌ ఫోన్లలో నీలిచిత్రాలను ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
    ఈ తరహా సైట్లను వీక్షించడంలో పాకిస్థాన్ వాసులు ముందు వరుసలో ఉండగా, ఆరో స్థానంలో భారత్ ఉంది.అంతర్జాలంలో పోర్న్ సైట్లకు ఉన్న ఆదరణ మరేయితర సైట్లకు లేదని చెప్పొచ్చు.  ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికమవుతుండడంతో చైనా ప్రభుత్వం ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. సైబర్‌స్పేస్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న సుమారు 4వేల వెబ్‌సైట్లను తొలగించింది. అసభ్య పదజాలం, అశ్లీలత, హింసాత్మకమైన ఘటనలతో కూడిన లైవ్‌స్ట్రీమింగ్ వెబ్‌సైట్లపై చైనా సైబర్ క్రైమ్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ మేరకు జిన్ హువా న్యూస్ ఏజెన్సీ ఓ కథనం ద్వారా వెల్లడించింది.

                                                                                                     -ఎడిటోరియల్ డస్క్ 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జీవితాల్లో చిచ్చు రేపుతున్న పోర్న్‌ సైట్స్‌ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top