Translate

  • Latest News

    31, అక్టోబర్ 2017, మంగళవారం

    ఒక అడుగు వెనక్కు తగ్గిన మోదీ


    నిన్న, మొన్నటిదాకా తనకెదురులేదన్నట్టున్న ప్రధాని మోదీ ఇప్పుడు కొంచెం వెనక్కు తగ్గినట్టే కనిపిస్తున్నారు. ఏడాది క్రితం తీసుకున్న నోట్ల రద్దు నిర్మాణం, ఆ తర్వాత తీసుకున్న జి.ఎస్.టి నిర్ణయం బెడిసికొట్టాయి. ఈ నేపధ్యంలో త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ కొంచెం వెనక్కు తగ్గారు. గుజరాత్ లో పటేళ్ల ఉద్యమం ఏకు మేకవడం, ఆ తర్వాత దళిత యువకులపై దాడి చేసి కొరివితో తల గోక్కున్నట్టయింది. దళిత ఉద్యమం ఉవెత్తున ఎగియడం, తదనంతరం జి.ఎస్.టి పుణ్యమా అని గుజరాత్ లో మొదటి నుంచి మోదీ ని వెన్నంటి ఉన్న  వ్యాపార వర్గాలు కూడా ఎదురుతిరగడం... ఇన్ని ప్రతికూలతల మధ్య గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ లో జరగనున్నాయి. అందుకే మోడీ ఒక అడుగు వెనక్కు వేశారు... కాదు..కాదు... వేసినట్టు నటిస్తున్నారు. నిన్నటిదాకా ఇందిరా గాంధీ పేరు తలవడడానికి కూడా ఇష్టపడని మోదీ, గాంధీ కుటుంబానికి ప్రత్యామ్నాయంగా పటేల్ ను, శ్యాం ప్రసాద్ ముఖర్జీ ని, వీరసావర్కార్ ను ముందుకు తెచ్చిన మోదీ అకస్మాత్తుగా స్వరం మార్చి ఇందిరను పొగిడారు. ఇందిరా ఇప్పటికి ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని ఒప్పుకున్నారు. తప్పలేదు...దళితుల ఓట్ల కోసం ఆ మాట అనక తప్పలేదు. అందుకే ఇందిరమ్మను పొగడక తప్పలేదు. ఏదయినా గుజరాత్ ఎన్నికలు మోదీ కి అత్యంత ప్రతిష్టాత్మకం. తన సొంత రాష్ట్రంలో ఏదయినా తేడా పడితే తన సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. ఏం చేసైనా సరే గుజరాత్ లో గెలిచి తీరాలి. చూద్దాం...గుజరాత్ ఎన్నికల లోపు మోదీ, అమిత్ షా ద్వయం ఇంకెన్ని ప్లాన్లు వేస్తారో.. 

                                                                                                                  -మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఒక అడుగు వెనక్కు తగ్గిన మోదీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top