Translate

  • Latest News

    1, నవంబర్ 2017, బుధవారం

    ఆంద్రజ్యోతి నయా ట్రెండ్ ....కేంద్రంపై పోరాటానికి సిద్ధమౌతున్న టీడీపీ


    రాష్ట్ర అధికార పార్టీ మానస పుత్రిక ఆంద్రజ్యోతి నయా ట్రెండ్ కేంద్రం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుంది. టీడీపీ బీజేపీ నుంచి దూరం జరుగుతుందా... భవిష్యత్తులో కేంద్రంతో వ్యవహరించే విధానమేమిటి..? అన్న అంశాలు ఆంద్రజ్యోతిలో వచ్చిన కథనం చెప్పకనే చెబుతుంది. ఏపీకి టోపీ అన్న బ్యానర్ ఐటమ్ లో  కేంద్ర వైఖరిపై కథనం ప్రచురించింది. గతం నుంచి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను ఈ పత్రిక ద్వారా ముందే బయటకు రావటం అందుకు ప్రజలను సంసిద్ధం చేయటం జరుగుతున్న పరిణామమే.
     రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలోనే ఆంధ్రజ్యోతి హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలు అన్న విధంగా గతంలో కథనాలు వెలువరించింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నోటి నుంచి ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలు అన్నమాటలు వెలువడ్డ విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. గత కొంత కాలంగా కేంద్ర, రాష్ట్రం మధ్య  సరైన సంబంధాలు లేవు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి కనీస గౌరవం కూడా ఇవ్వటంలేదు. భూసేకరణ బిల్లుకు బ్రేక్ వేయటమే కాకుండా, పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞాపనలను బుట్టదాఖలు చేసింది. ఈ దశలోనే ఆంద్రజ్యోతి మసకబారుతున్న మోది .అంటూ ఆదివారం ఆర్కె తన కథనాన్ని వెలువరించారు. వీటన్నిటిని బట్టి చూస్తే కేంద్రంతో టీడీపీ ప్రభుత్వం అమీతుమీకి సిద్ధమౌతున్నట్లే అనిపిస్తుంది. ఇందుకు సంబంధించి వ్యూహాలు, భవిష్యత్తు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. పవన్ ఉత్తరాది రాష్ట్రాలు, దక్షణాది రాష్ట్రాల వివక్షను ట్విట్టర్లో ప్రశ్నించారు. ఇదే అంశంపై టీడీపీ పోరాటానికి సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రజలను సంసిద్ధం చేయటానికి కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్న వాదనను బలంగా ఇంజక్ట్ చేసేందుకు ఆంద్రజ్యోతి సిద్దమైంది.

    - - - - -శ్రీహర్ష


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆంద్రజ్యోతి నయా ట్రెండ్ ....కేంద్రంపై పోరాటానికి సిద్ధమౌతున్న టీడీపీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top