Translate

  • Latest News

    2, నవంబర్ 2017, గురువారం

    జగన్ పాదయాత్ర కు టీడీపీ ప్రచారం


    జగన్ పాదయాత్ర సందర్భంగా తుని తరహా కుట్రలకు పాల్పడినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చినీయాంశం గా మారాయి . మనం చేసిన పనులు ప్రజలకు చెబితే చాలు. వైకాపా మొదటి నుంచీ ఏదో ఒక కుట్రలో మనల్ని ఇరికించాలని చూస్తోంది. వారి నేర ప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని రేపటి పాదయాత్రను నిశితంగా గమనించాలని సీఎం చేసిన మాటల్లో మర్మం మేమిటో వెతికే  పనిలో పడ్డారు .విశ్లేషకులు. ముందునుంచి టీడీపీ జగన్ పాదయాత్ర పై ఎందుకనో ఒకింత భయంగా నే ఉన్నట్లు తెలుస్తోంది .
     చంద్రబాబు సైతం జగన్ పాదయాత్ర పై స్పీడ్ పెంచారు . మంత్రులు,నాయకులు యధావిధిగా అధినేత బాటనే అనుసరిస్తూ జగన్ పాదయాత్ర పై విమర్శలు ఎక్కుపెట్టారు . ఈ క్రమంలో ఏపీలో పాదయాత్రలకు పర్మిషన్ తీసుకోవాలన్న డీజీపీ వ్యాఖ్యలు  ప్రజల్లో కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా పాదయాత్ర చేయవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనుమతి తీసుకోలేదనే విషయాన్ని వైకాపా నేతలు గుర్తు చేస్తున్నారు. పాదయాత్రకు అనుమతి పేరుతో ప్రభుత్వం ఆటంకాలు సృష్టించాలనే వ్యూహంతో ఉందని వైకాపా  వర్గాలు అనుమానిస్తున్నాయి.ఒకవేళ పోలీసులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయలనే దానిపైన వైకాపా  నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రతిపక్ష నేత పాదయాత్రను కుట్రపూరితంగా అడ్డుకున్నారని ఆరోపిస్తూ బలంగా ప్రజల్లోకి వెళ్లాలనే ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే అంశం పై   .భిన్నస్వరం లో ... పాదయాత్ర కు అడుగడుగునా హర్డిల్స్ ... ( లింక్ ఇదే http://www.bhinnaswaram.com/2017/10/blog-post_18.html) కధనం వెలువరించింది . పాదయాత్ర ల విషయం లో ప్రభుత్వం   వ్యవహరిస్తున్న  తీరు ఆ యాత్రలకు ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి .గతంలో కాపు ఉద్యమ  నేత ముద్రగడ పాదయాత్ర  విషయంలో ప్రభుత్వ తీరు కాపు ఉద్యమానికి ప్రచారంగా మారింది 
     పదేపదే జగన్ ను విమర్శించటం తో ప్రజల్లో మరొక రకమైన నెగిటివ్ ప్రచార ప్రమాదం లేక పోలేదు . మరి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహమేటో ...?

    - మానవేంద్ర 






    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ పాదయాత్ర కు టీడీపీ ప్రచారం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top