Translate

  • Latest News

    28, అక్టోబర్ 2017, శనివారం

    సంకుల సమరం అప్పుడే మొదలైoది

    అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే గడువున్నా ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. కులాల సంకుల సమరం మొదలయింది. ఏ కులానికి ఆ కులం తమ అస్తిత్వం కోసం ప్రకటనలు, కార్యాచరణ ప్రణాళికలు మొదలు పెట్టాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ముందు ఇది మామూలే. అయితే ఈసారి కులాల ఐక్య సంఘటనలు మొదలయ్యాయి. సామాజిక శక్తుల పునరేకీకరణ జరుగుతోంది. అల్ప సంఖ్యాక వర్గాల పునరేకీకరణ అయితే మంచిదే కానీ... ఇక్కడ జరుగుతున్నది అగ్ర వర్ణాల ఐక్య సంఘటనలు. ఇది సమాజంలో భవిష్యత్తులో భయానక పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉంది. కులం పేరుతొ, మతం పేరుతొ ఫాసిజంకు బాటలు వేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి ని నడిపిస్తున్న హిందుత్వ శక్తులే వీటికి ఆలంబన. ఆ అధికార బలంతోనే బడుగుల గొంతులో నుంచి మాట బయటకు రాకుండా గొంతులోనే అణిచేసే భయంకరమైన కుట్ర జరుగుతోంది. సభలు పెట్టనీయకుండా పోటీ సభలు అనౌన్స్ చేసి చివరకు తమ చేతికి మట్టి అంటనీయకుండా పోలీసుల చేత పర్మిషన్ లేకుండా చేయడం కూడా ఈ కుట్రలో భాగమే. మున్నెన్నడూ లేని విధంగా బ్రాహ్మణ,వైశ్య ఐక్య సంఘటన కూడా వీరి ప్రణాళికే. ఆంధ్రా లో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ లో ఇంకో విచిత్ర పరిణామం జరుగుతోంది. అక్కడ వెల్కమ్ గ్రూప్ అవతరిస్తోంది. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్న సామెతగా వెలమ దొరలూ తెలంగాణలో, కమ్మ చౌదరిలు ఆంధ్రా లో దోచుకుంది చాలక రెండు రాష్ట్రాలను ఇద్దరు కలిపి దోచుకోవడానికే ఈ వెల్కమ్ గ్రూప్ అవతరిస్తోంది. దీన్ని నిరసిస్తూనే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి తిరుగుబాటు చేసాడు. రానున్న ఏడాది కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని చిత్ర విచిత్ర సమ్మేళనాలు జరుగుతాయో చూద్దాం మరి. --మానవేంద్ర
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సంకుల సమరం అప్పుడే మొదలైoది Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top