Translate

  • Latest News

    13, అక్టోబర్ 2017, శుక్రవారం

    మీడియాలో ప్రచారానికి మోడీ సర్కార్‌ వ్యూహం..



    ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆదేశించింది. అందుకు ప్రచార వ్యూహాన్ని అనుసరించాలని సూచించింది. సెప్టెంబర్‌ 15వ తేదీతో ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రా పేరుతో ఈమేరకు కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు అందాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్య నిర్ణయాల విషయంలో ప్రజల్లో సానుకూల అభిప్రాయాలు కలిగించేలా ప్రచార నమూనాలను రూపొందించుకోవాలని పీఎంవో కార్యాలయం సూచించింది. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ సందేశాలు, ఫేస్‌బుక్‌ పోస్టులు, ట్వీట్ల ద్వారా ప్రచారం నిర్వహించాలని తెలిపింది.ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల పట్ల పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా ప్రజల్లో అనుకూల అభిప్రాయాలను చొప్పించేందుకు మీడియాలో సమన్వయంతో కూడిన సమాచార వ్యూహాన్ని అనుసరించాలని పీఎంవో సూచించింది. సోషల్‌ మీడియాతోపాటు ప్రభావితం చేయగల స్వతంత్ర నిపుణులను అందుకు ఉపయోగించాలని సూచించింది. అందుకోసం ఆయా మంత్రిత్వశాఖలు చెల్లింపులు చేయడానికి అనుమతిస్తున్నట్టు పీఎంవో తెలిపింది. ప్రచారం కోసం ప్రజల్లో ఆదరణ ఉన్న ఇంగ్లీష్‌, హిందీ, ప్రాంతీయ దిన పత్రికలను ఉపయోగించుకోవాలని తెలిపింది. ఎలక్ట్రానిక్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడడం, రేడియో, టీవీ చర్చా గోష్ఠుల్లో పాల్గొనడం ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించింది. అందరినీ ఆకట్టుకునేలా వీడియో సందేశాలు, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పోస్టులను రూపొందించుకోవాలని పీఎంవో తెలిపింది. క్యాబినెట్‌, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ నిర్ణయాలు, విధానాలను ఇతర మంత్రిత్వశాఖలు కూడా ప్రచారం చేయాలని పీఎంవో ఆదేశించింది. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మీడియాలో ప్రచారానికి మోడీ సర్కార్‌ వ్యూహం.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top