Translate

  • Latest News

    18, నవంబర్ 2017, శనివారం

    శాంతారాంకు గూగుల్ ఘన నివాళి


    భారతీయ సినిమా గర్వించదగ్గ మహా దర్శకుల్లో డా వి.శాంతారామ్‌ ఒకరు. శాంతారామ్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఝనక్ ఝనక్ పాయల్ బాజే... ఆ తర్వాత దో  ఆంఖేన్  బారాహ్  హాత్  ... ఆ తరువాత నవరంగ్... ఇలా హిందీ సినిమా రంగాన్ని తన దర్శకత్వ ప్రతిభతో నవనవోన్మేషంగా అలంకరించి ప్రేక్షుకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు శాంతారాం. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో కళాత్మకతను, కమర్షియల్ అంశంతో మేళవించి హిట్లు కొట్టిన తోలి దర్సకుడు ఈయనే... మన  విశ్వనాధ్  లాంటి వాళ్లకు స్ఫూర్తి ఈయనే అని చెప్పవచ్చు.
    డా వి.శాంతారామ్‌ మహారాష్ట లోని కొల్హాపూర్కు సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించాడు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించాడు. సుమారు 90 సినిమాలు నిర్మించాడు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించాడు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచాడు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్త్రీ, అమర్‌ భూపాలీ, డా కోట్నిస్‌కీ అమర్‌ కహానీ మొ. సినిమాలు శాంతారామ్‌ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్‌, గీత్‌ గాయా పత్థరోంనే, ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే మొ. చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించాడు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను వ్రాసుకున్నాడు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. అంతేకాక నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందిన ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించాడు. ఇంతటి గొప్ప దర్శకునికి ఈ రోజు అయన 116 వ జయంతి సందర్భంగా  గూగుల్ డూడుల్ ద్వారా నివాళి ప్రకటించడం మెచ్చుకోదగ్గ విషయం. 

    -ఎడిటోరిల్ డస్క్ 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శాంతారాంకు గూగుల్ ఘన నివాళి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top