Translate

  • Latest News

    19, నవంబర్ 2017, ఆదివారం

    ప్రధాని మోడీ పైనే ఎక్కుపెట్టిన బాణం ... ఆర్క్ కొత్త పలుకు..




    కొత్త పలుకు రూపంలో abn -ఆంధ్రజ్యోతి అధినేత ఆర్క్ తన మార్క్ పలుకులతో  మోదీ మార్కు ప్రేమ అంటూ విస్తృతమైన కధనాన్ని వండివార్చారు. ప్రభుత్వ భావజాలాన్ని  తన కధనాల ద్వారా వెలువరిస్తున్న రాధాకృష్ణ ప్రధాని పైనే తన కాలన్నీ ఎక్కుపెట్టడం విశేషం.  ప్రభుత్వ వైఖరి ని అడ్డం పట్టే విధంగా ఆర్క్ మార్క్ కథనాల్లో గతం కన్నా మిన్నగా ప్రధాని మోడీ పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాజకీయుల నుంచి ఏపీ ,తెలంగాణ వరకు ప్రధాని మోడీ చేస్తున్న పనులను ప్రస్తావించారు. 

     మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చాలా రోజులయ్యింది. ప్రధానిని కలవడానికి చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ లభించకపోవడం ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌గా ఉంది. ఈ విషయంలో ఇటు చంద్రబాబు– అటు నరేంద్ర మోదీ గుంభనంగా ఉంటున్నారు. అయినా ఇరువురి మధ్య సఖ్యత చెడిందని జనం చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుపాకాన పడుతోంది. ఈ ప్రాజెక్టు తొలి దశను 2018 లోపు పూర్తిచేసి, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇందుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్రం కూడా భరోసా ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీలు, చేసిన బాసలు ఇప్పుడు గాలికి పోతున్నాయి.... అంటూ ఆవేదన చెందారు . పనిలో పనిగా ... 

    నియోజకవర్గాల సంఖ్యను పెంచితే నాయకులందరినీ సర్దుబాటు చేయవచ్చునన్నది ఇరువురు ముఖ్యమంత్రుల అభిప్రాయం. ఫలితంగా వచ్చే ఎన్నికల తర్వాత సులువుగా అధికారంలోకి రావచ్చన్నది వారి ఆలోచన! కేంద్రంలోని పెద్దల ఆలోచన ఏమిటో గానీ ఈ విషయంలో కలిసి రావడం లేదు. ప్రాజెక్టులు, పథకాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి కేంద్రంపై ఆధారపడినట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆధారపడటం లేదు. ఈ కారణంగా పరిస్థితులను బట్టి స్వేచ్ఛగా వ్యవహరించే వెసులుబాటు కేసీఆర్‌కు ఉంది. ఏపీలో అడుగులు ముందుకు పడాలంటే కేంద్ర సహకారం ఎంతో కొంత అవసరం. ఈ కారణంగానే అవమానాలు ఎదురవుతున్నా తమ నాయకుడు ఓర్చుకుంటున్నారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.... చంద్రబాబు సహనాన్ని పొగిడారు. మరో వైపు .

    . అయితే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రేటింగ్స్‌కి క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులకు మధ్య ఎప్పుడూ పొంతన ఉండదు. అంతర్జాతీయ ప్రముఖుల నుంచి లభించే ప్రశంసల వల్ల అధికారంలో ఉన్నవారికి పెద్దగా ప్రయోజనం ఉండదు. గతంలో చంద్రబాబు విషయంలో ఇది రుజువయ్యింది. 1999– 2004 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించేవారు. అయినా 2004 ఎన్నికలలో ఆయన ఓటమిపాలయ్యారు.... మోడీ లభించిన ఖ్యాతి పై అక్కసు వెళ్లగక్కారు . ఇక జగన్ ప్రస్తావన లేకుండా ,ఆయనపై విమర్శలు కాలం ఎలాగూ ఉండదు .. జగన్ ఇస్తున్న హామీలపై లెక్కలు తేల్చారు .
    క లిసిరాని బీజేపీకి విడాకులు ఇచ్చి జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకునే అవకాశం లేకపోలేదు. రాజకీయాలకు నిర్వచనం మార్చాలన్న ఉదాత్త ఆశయంతో జనసేనపార్టీని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల వ్యతిరేక భావం లేదని చెబుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పినందుకు బీజేపీ పెద్దలపై పవన్‌ కల్యాణ్‌ కినుక వహించి ఉన్నారు. ఈ కారణంగా ఆయన బీజేపీతో చేతులు కలిపే అవకాశం లేదు. ఇక మిగిలిన వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌తో చేతులు కలిపితే పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుందన్న అభిప్రాయం ఉంది... అంటూ టీడీపీ పాత మిత్రుడు పవన్ దారిని ఆర్కే స్పష్టం చేశారు. 

    మొత్తం మీద భవిషత్ చిత్రపటాన్ని ఇలా ఆవిష్కరించారు. 

    -ఎడిటోరియల్ డస్క్ 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రధాని మోడీ పైనే ఎక్కుపెట్టిన బాణం ... ఆర్క్ కొత్త పలుకు.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top