Translate

  • Latest News

    20, నవంబర్ 2017, సోమవారం

    భిన్నస్వరం వినిపిస్తేనే సహించని ప్రభుత్వం... .


    అవార్డులు నిలిపి వేస్తామంటూ బెదిరింపులా... హవ్వ... హవ్వ... 
    ఇంటికి చెదలు పట్టాయని, ఇంటిని తగలపెట్టుకుంటామా. అలాగే ఉంది  ప్రభుత్వ తీరు.ఇటీవల మూడు సంవత్సరాల నంది అవార్డులను  ప్రభుత్వం ప్రకటించటం, వివాదాలకు దారి తీయటం తెలిసిందే.ఈ క్రమంలో ప్రభుత్వ అనధికారిక పత్రిక ఆంద్రజ్యోతి ఒక కథనం ద్వారా ప్రభుత్వ ఆలోచనను  బయటపెట్టింది. .

    ఆ కధనం ప్రకారం నంది అవార్డుల రచ్చ ఇలాగే కొనసాగితే అసలు అవార్డులు ఇవ్వడమే నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ ఉన్నా,తాము అవార్డులు ఇచ్చామన్న సంగతి గుర్తుంచుకోవాలని ప్రభుత్వవర్గాలు చెబుతున్నట్లు ఆ కదనం తెలిపింది. ఈ'నంది అవార్డులను ప్రకటించడంతోపాటు తెలుగువారు గర్వపడేలా విజయవాడలోని కృష్ణానది పవిత్ర సంగమం ప్రాంతంలో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని, తాజా పరిణామాలతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భిన్నస్వరం వినిపిస్తేనే సహించని ప్రభుత్వం ఇలా బెదిరింపు ధోరణికి పాల్పడటం మరిన్ని విమర్శలకు దారి తీస్తుంది.
    తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఎన్నో అద్భుత కళాఖండాలు గతంలో నంది అవార్డులు పొందాయి\. డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, రంగులరాట్నం, సుడిగుండాలు,భాంధవ్యాలు,కథానాయకుడు,అల్లూరి సీతారామరాజు తదితర చిత్రాలతో పాటు మొన్నటి స్వాతి ముత్యం,శృతిలయలు,స్వర్ణ కమలం,ఆ నలుగురు లాంటి ఉత్తమ చిత్రాలకు అవార్డులు వరించాయి. రాను రాను కమర్షియల్ చిత్రాలు కూడా ఇందులో చేరాయి. 
    నంది అవార్డుల ఎంపికలో ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, మిగిలిన వారిని చిన్నచూపు చూశారన్న విమర్శలతో ప్రభుత్వ పరువు పోయింది. అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, హేతుబద్ధంగా జరగలేదన్న వివాదం రాజుకుంది . ఏపీ ప్రభుత్వ నేతలు తమకు కావలసినవారికి, సీఎం చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గం వారికే అవార్డులకు ఎంపిక చేశారని ఆరోపణలు వెల్లువెత్తటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది .దిద్దుబాటు చర్యలు చేపట్టి వివాదం సమసిపోయేలా చేయాల్సిన  ప్రభుత్వ పెద్దలు అసలు అవార్డులు ఇవ్వడమే నిలిపివేస్తామని లీకులు ఇవ్వటం బెదిరించే ధోరణికి అద్దం పడుతుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఎల్లో వెబ్సైట్ ,టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఇదంతా జగన్ పనే అంటూ కొత్త రాగం అందుకున్నాయి 

    -మానవేంద్ర 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భిన్నస్వరం వినిపిస్తేనే సహించని ప్రభుత్వం... . Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top