Translate

  • Latest News

    21, నవంబర్ 2017, మంగళవారం

    దీపిక త‌ల‌ను కాపాడుకుందాం: క‌మ‌ల్‌


     క‌మ‌ల్ హాస‌న్ కొద్ది రోజులుగా స‌మాజంలో జ‌రిగే అసాంఘిక కార్య‌క‌లాపాల‌తో పాటుగా ప‌లు స‌మ‌స్య‌లుగా స్పందిస్తూ వ‌స్తున్నారు . తాజాగా దీపిక వివాదంపై ఆయ‌న ట్విట్ట‌ర్‌లో సీరియ‌స్ ట్వీట్ చేశారు. చిత్రంలో రాణి ప‌ద్మావ‌తి పాత్ర పోషించిన దీపి క త‌ల తెస్తే పది కోట్ల నజరానా ప్రకటిస్తామ‌ని బీజేపీ చీఫ్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ ఎస్పీ అము తెలిపారు. అంతకు ముందు శ్రీ రాజ్‌పుత్‌ కర్ణి సేన ఆమెను శూర్ఫణకతో పోలుస్తూ ముక్కును కత్తిరించాలని.. తల తెగ్గొట్టిన వారికి కోటి రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై బాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీ భ‌గ్గుమంది. ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు దీపిక‌కి మ‌ద్ద‌తునిచ్చారు. తాజాగా క‌మ‌ల్‌.. దీపిక త‌ల‌కి రేటు క‌ట్ట‌డాన్ని ఆక్షేపిస్తూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు. దీపిక త‌ల‌ను కాపాడుకోవ‌ట‌మే నేను కోరుకునేది. ఆమె శ‌రీరం, స్వేచ్చ కంటే కూడా త‌ల‌నే గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌తంలో నా చిత్రాల‌ను కూడా ప‌లు వ‌ర్గాలు వ్య‌తిరేఖించారు. ఏదైనా చర్చలో తీవ్రవాదం దుర్భరమవుతుంది. ఇక భ‌రించింది చాలు.. ప్ర‌జ‌లారా మేల్కొండి. ఇక ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.. ఆమెని ర‌క్షించుకుందాం. అంటూ క‌మ‌ల్ ట్వీట్ చేసారు 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దీపిక త‌ల‌ను కాపాడుకుందాం: క‌మ‌ల్‌ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top