Translate

  • Latest News

    21, నవంబర్ 2017, మంగళవారం

    ఏపీ జనానికి ప్రభుత్వ ,ప్రతిపక్ష పార్టీల ఫోన్ల గొడవ


    ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొన్ని పోన్ల గొడవ ఎక్కువైంది. . ఈ  ఫోన్లు సెల్యులర్ ఆపరేటర్ల ప్యాకేజీల తాలుకు ప్రమోషన్ కోసం మాత్రం కాదు. ఏకంగా ప్రభుత్వం , ప్రతిపక్షం ఇరుపార్టీలు సామాన్యులకు ఫోన్లతో వాయించేస్తున్నారు.ఈ ఫోన్ల దెబ్బకు ప్రజలు బెంబేలెత్తున్నారు. ప్రభుత్వం ప్రతిపనికి ప్రజల నుంచి అభిప్రాయాలు కనుకోవటానికి ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గతంలోనూ నియోజకవర్గ ఎమ్మెల్యేల ఎంపిక సమయంలోనూ ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజల అభిప్రాయాలు కొరటం ఆనావాయితీగా ఉన్న విషయంమే. ప్రస్తుతం మూడున్న సంవత్సరాల పాలనపై ప్రజల అభిప్రాయాలు కనుక్కోవటానికి ఫోన్లనే ఆశ్రయిస్తున్నారు. పాలన తీరు ఎలా ఉందని ,ఎంత సంతృప్తిలో ఉన్నారని చంద్రబాబునాయుడు వాయిస్తో మెసెజ్ అందుతుంది. పాలన సంతృప్తిపై సమాధానాలు ఇవ్వకపోతే ఒక సమస్య, ఇస్తే ఒక సమస్య అని సమాన్యులు భయపడుతున్నారు.మరో వైపు ప్రభుత్వం నుంచి వస్తున్న కాల్స్ సామాన్యులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాము ఎవరి మీద ఫిర్యాదు చేయకపోయినా మీరు ఫలానా అధికారిపై ఫిర్యాదు చేశారు. అంటూ ఆధార్ కారు నంబర్తో సహా వివరాలు చెబుతుంటే తాము చేయని ఫిర్యాదుకు ఎలా బాధ్యులమని పలువురు వాపోతున్నారు.

     మరోవైపు వైఎస్సార్ కుటుంబం పేరుతో వైకాపా కార్యాలయం నుంచి వస్తున్న ఫోన్ల ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఫోన్చేసిన వారికి సరైనా అవగాహన లేకపోవటంతో సమస్య జఠినమౌతుంది.వైకాపా నాయకులు ఇంటింటికి తిరిగి ఫోన్ నంబర్ ద్వారా మిస్సుడ్ కాల్ ఇప్పించి మరి సభ్వతాలు పూర్తి చేసుకొన్నారు.సభ్యత్వం స్వీకరించిన వారికి పీకే టీమ్ ద్వారా వస్తున్న కాల్స్ సహనాన్ని పరీక్ష పెడుతున్నాయి. పేరు.నియోజకవర్గం, కుటుంబసభ్యుల వివరాలు,జిల్లా , నియోజవర్గం, గ్రామం,పట్టణం వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇంతవరకే బాగానే ఉంది. సమస్యలు అడిగి తెలుసుకొన్న తరువాత మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటూ అడిగే ప్రశ్న టీమ్ రాజకీయ అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తున్నాయి. ప్రశ్న అడిగే వ్యక్తికి ఆ నియోజవర్గానికి సంబంధించి, రాష్ట్ర రాజకీయాల గురించి కనీస అవగాహన ఉండాలి. అదీ ఏలాగు లేదు. సరే ఆ నియోజవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అన్న విషయం అన్న తెలియాలి. ఆ విషయాలు తెలుసుకొన్నట్లు లేరు. దీంతో సమాధానం చెప్పే వారి సహనాన్ని పరీక్షిస్తున్నట్లు ఉంటున్నాయి. అంతా అయ్యాక మీ ఫిర్యాదు నమోదు చేసుకుంటున్నాం. మీ సెల్ కు  నంబర్ కు  ఒక నంబర్ వస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తారు. అంటూ ముగిస్తున్నారు. ఈ ఏపిసోడ్ మొత్తంలో సభ్యత్వ నమోదుతో పాటు పనిలో పనిగా రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున గెలిచే వ్యక్తి ఎవరో అన్న విషయాలను రాబట్టడం జరుగుతుంది.  ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రజలు హడలిపోతున్నారు 

    మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీ జనానికి ప్రభుత్వ ,ప్రతిపక్ష పార్టీల ఫోన్ల గొడవ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top