Translate

  • Latest News

    22, నవంబర్ 2017, బుధవారం

    పవర్‌ దక్కాలంటే పాదయాత్ర .. ప్రజాయాత్ర కు పవన్ సిద్ధం


    ఇప్పుడు పాదయాత్రల  సీజన్ నడుస్తోంది. అధికారం అందుకోవటానికి  తండ్రి చూపిన షార్ట్ కట్ మార్గం గా జగన్ పాదయాత్ర నే ఎంచుకున్నారు . గతం లో ఎన్నిక ల అప్పుడే ప్రచారం నిర్వహించే వారు. కానీ జనం లో ఉండటానికి  పాదయాత్ర కన్నా మరో మార్గం లేదని భావిస్తున్నారు  ప్రస్తుతం జనసేన పార్టీ బరిలోకి దిగే ముందు ఆషామాషీగా కాకుండా ప్రజా నాడిపై పూర్తి అవగాహన ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యణ్ భావిస్తున్నారని సమాచారం  . అందుకే త్వరలో జనసేన అధినేత కూడా ప్రజాయాత్ర మొదలు పెట్టనునున్నారని తెలుస్తోంది  .పవన్ నేరుగా జనంలోకి వెళ్లి వాళ్ల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటారని తెలిసింది  ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉందని, ఆ లోపు పార్టీని పూర్తిస్థాయిలో విస్తరించేందుకు 'పవన్‌' తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన 'లండన్‌' పర్యటన ముగించుకుని..వచ్చిన దగ్గర నుంచి పార్టీ విస్తరణ కార్యక్రమాలపై పూర్తిస్థాయి దృష్టిపెట్టబోతున్నారు. ఈ లోపు తాను పూర్తి చేయాల్సిన సినిమాను కూడా పూర్తి చేసి పార్టీపై పూర్తి సమయం వెచ్చించబోతున్నారు. పైగా పవన్ కేవలం ఒక్క ఎపికే పరిమితం కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాయాత్ర నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.  లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ తమ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రజాయాత్ర విషయమై నిర్ణయం తీసుకున్నారట. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన రావాలంటే ప్రజాయాత్ర చేపట్టక తప్పదని పవన్ భావిస్తున్నారట. అయితే ఈ సందర్భంగా తాను రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నట్లు పవన్ చెప్పారట. అయితే ఈ ప్రజాయాత్ర అనేది పాదయాత్రా లేక బస్సుయాత్రా అనే విషయంపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
    ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే..రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార టిడిపి తనకు ఎదురేలేదన్నట్లు దూసుకుపోతుంటే...మరో ప్రతిపక్ష వైకాపా సర్వశక్తులు సమీకరించుకుని పోరాటానికి సై అంటోంది. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపోయినా..తమకు ప్రజల్లో ఉన్న అభిమానమే తమను నిలబెడుతుందని వైకాపా నాయకులు భావిస్తున్నారు  నిజంగా 'పవన్‌' పాదయాత్ర చేస్తే అది 'జగన్‌' పార్టీపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. ప్రజల్లో మంచి ఇమేజ్‌ ఉన్న 'పవన్‌' పాదయాత్ర మొదలు పెడితే కొంత మేర జగన్ కు మైనస్ అయ్యే అవకాశం లేక పోలేదు . అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌ దక్కాలంటే పాదయాత్ర తప్పకుండా అన్న చందంగా తయారైంది పరిస్థితి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

    మానవేంద్ర 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పవర్‌ దక్కాలంటే పాదయాత్ర .. ప్రజాయాత్ర కు పవన్ సిద్ధం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top