Translate

  • Latest News

    23, నవంబర్ 2017, గురువారం

    ముందు మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదించండి...

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాక సందర్భంగా మన వాళ్ళు చేస్తున్న హడావుడి అంతా...ఇంతా కాదు.  ఈ నెల 28-30 మధ్య హైదరాబాద్ లో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఆమె పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) లో మొత్తం 170 దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. కేవలం అమెరికా నుంచి మాత్రమే 350 మంది పాల్గొంటున్నారు.ఈ బృందానికి  ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సదస్సును ప్రతి ఏడాదీ నిర్వహిస్తారు. తొలి సదస్సు 2010లో అమెరికాలో జరిగింది. తర్వాత వరుసగా టర్కీ (2011), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2012), మలేసియా (2013), మొరాకో (2014), కెన్యా (2015), అమెరికా (2016)లలో సదస్సులు జరిగాయి. ప్రస్తుతం 8వ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈసారి హైదరాబాద్ లో జరుగుతోంది. అమెరికాతో కలిసి నీతి ఆయోగ్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుంది. దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది  వేదిక. ప్రధానంగా యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల (స్టార్టప్స్)ను ప్రోత్సహించడం, పెట్టుబడులు పొందేందుకు సహాయం చేయడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం లక్ష్యం. ఈసారి ఉమెన్ ఫస్ట్... ప్రోస్పెరిటీ ఫర్ అల్ అనే థీమ్ తో ఈ సదస్సు జరుగుతుందని చెబుతున్నారు. మహిళలు ఆర్ధికంగా సాధికారత సాధిస్తే మొత్తం దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతుందనేది దాని సారాంశం. అంతా బాగానే ఉంది... చెప్పడానికి... ఆచరణ ఏది. పార్లమెంట్ లో మహిళా బిల్లు నే ఆమోదించడానికి అంగీకరించని మన ఘనత వహించిన మగ  మహాశయులు... విదేశాల నుంచి వచ్చే యువ రాణులకు మాత్రం అడుగులకు మడుగులొత్తుతారు.. రెడ్ కార్పెట్లు పరుస్తారు... వాళ్ళు వస్తున్నారని మన రోడ్లపై బిచ్చగాళ్లను అందరిని తీసుకువెళ్లి జైల్లో పెడతారు... అయ్యా...  మీరు ఏమీ చెయ్యద్దు... ముందు 20 ఏళ్లుగా  పార్లమెంట్లో మూలుగుతున్న మహిళా బిల్లును ఆమోదించండి చాలు... ఆ తర్వాత మీరు ఏమి చెప్పినా  మేము వింటాం...
                                                                                                                                          -మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ముందు మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదించండి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top