Translate

  • Latest News

    24, నవంబర్ 2017, శుక్రవారం

    ఏపీలో మంత్రి వర్గ విస్తరణ తప్పదా.. ?


    ఏపీలో కేబినేట్ విస్త‌ర‌ణ ఉండ‌ద‌ని లోకేష్ చెబుతున్నా ... మంత్రి వర్గ విస్తరణ తప్పదనే చెబుతున్నారు.  వ‌చ్చె ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని భారీ మార్పులు,చేర్పులు ఉండ‌బోతున్నాయి. ఇదే చివరి విస్తరణ  అని చెబుతున్నారు .  అవినీతి ఆరోపణలు ఉన్న  మంత్రుల‌ను తప్పించి కొత్త వారిని తీసుకొనేందుకు బాబు సిద్ధ‌మ‌య్యారు. కేబినెట్ ప్ర‌క్షాల‌న‌లో భాగంగా ఇరువురికి ఉద్వాసన తప్పదని  గుసగుసలు వినిపిస్తున్నాయి. 
     కేబినెట్ నుంచి అవుట్ అవుతోన్న వారి లిస్టులో ప్ర‌ధానంగా మంత్రి నారాయ‌ణ పేరుతో పాటు ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు పేరు లైన్లో ఉంది. ఈ లిస్ట్‌లో మూడో పేరు అఖిల ప్రియ ఉంటుందా అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. .ఇక కొత్త‌గా కేబినెట్‌లోకి వ‌స్తార‌ని పేర్లు వినిపిస్తోన్న వారిలో ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచి ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో టీడీపీలోకి జంప్ చేసేశారు. ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ అండ‌తో గొట్టిపాటికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్టు తెలుస్తోంది.ఇక అనంత‌పురం జిల్లాలో సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న జేసీ సోద‌రుల‌ను సంతృప్తి ప‌రిచే క్ర‌మంలో తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ.ప్ర‌భాక‌ర్‌రెడ్డి పేరును కూడా కేబినెట్ రేసులో ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక టీడీపీకి కంచుకోట లాంటి ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పేరు కూడా మంత్రి ప‌ద‌వి రేసులో ఉందంట‌. కేబినేట్ ప్ర‌క్షాల‌న స‌మ‌యానికి లిస్ట్‌లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవ‌చ్చు.
    ఇది ఇలా ఉంటే పచ్చ కండువా కప్పుకున్న పలు పార్టీల నేతలు తమ సంగతి ఏమిటని అధినేత వద్ద వాపోయినట్లు సామాచారం . పరిపాలన మొదలై మూడు సంవత్సరాల  గడిచినా నామినేటెడ్ పదవులు గాని , ముఖ్యపదవులు గాని అందక పోవటంతో పలువురు నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. వారిని ఎలా తృప్తి పరచాలన్నది ప్రస్తుతం కీలకంగా మారింది. 

    -మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీలో మంత్రి వర్గ విస్తరణ తప్పదా.. ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top